నేడు తెలంగాణలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం హెచ్చరిక

By Arun Kumar PFirst Published Jul 23, 2021, 2:03 PM IST
Highlights

ఇప్పటికే భారీ వర్షాలతో తడిసి ముద్దయిన తెలంగాణకు మరో మూడురోజులు వర్షాల ముప్పు పొంచివుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న మూడురోజులు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి ఎలా వుండనుందో వాతాావరణ కేంద్రం ప్రకటించింది, 

హైదరాబాద్: నిన్న(గురువారం) వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ(శుక్రవారం) మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ప్రస్తుతం ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీరంలోని కొనసాగుతుందన్నారు.  ఈ అల్పపీడనానికి అనుభందంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని... ఇది సముద్ర మట్టానికి సగటున 5.8 కి మీ ఎత్తు వరకు కొనసాగుతుందని తెలిపారు. వీటి ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడురోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్ర సంచాలకులు హెచ్చరించారు. 

శుక్రవారం తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి  మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని ప్రకటించారు. ఇక ఒకటి రెండు ప్రదేశాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించారు.  రేపు, ఎల్లుండి(శని, ఆదివారం) కూడా ఒకటి రెండు ప్రదేశాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించారు.   వచ్చే అవకాశాలు ఉన్నాయి.

read more  ఆశ్రమాన్ని చుట్టుముట్టిన గోదావరి... ఏడుగురు స్వాములను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ (వీడియో)

ఇక రాష్ట్రవ్యాప్తంగా రేపు, ఎల్లుండి కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని వెల్లడించారు. రాగల 2 రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు(గాలి వేగం 30 నుండి 40 కి మీ)తో కూడిన వర్షాలు    కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

రాష్ట్రంలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్  అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలతో ఆయా జిల్లాల్లో పరిస్థితులను సీఎం కేసీఆర్ గురువారం నాడు సమీక్షించారు. భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువనుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో  వరద ఉదృతి పెరుగుతున్నందున యుద్ద ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులను, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 

click me!