భారీ వర్షాలకు వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి.. కుటుంబానికి సత్యవతి రాథోడ్ పరామర్శ..(వీడియో)

Published : Jul 23, 2021, 01:21 PM IST
భారీ వర్షాలకు వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి.. కుటుంబానికి సత్యవతి రాథోడ్ పరామర్శ..(వీడియో)

సారాంశం

రాష్ట్ర గిరిజన, స్త్రీ -  శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అతని మృతదేహానికి మహబూబాబాద్ ప్రభుత్వ దవాఖాన వద్ద నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మహబూబాబాద్ జిల్లా, బయ్యారం, మెట్ల తిమ్మాపురం వద్ద  వ్యవసాయ పనుల నిమిత్తం వాగు దాటి వెళ్తుండగా ఓ వ్యక్తి వాగులో కొట్టుకుపోయాడు.  భారీ వర్షాల వల్ల పొంగుతున్న కాలువలో పడి తాటి రవి (26) మృతి చెందాడు.

"

రాష్ట్ర గిరిజన, స్త్రీ -  శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అతని మృతదేహానికి మహబూబాబాద్ ప్రభుత్వ దవాఖాన వద్ద నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సత్యవతి రాథోడ్ తో పాటు జెడ్పీ చైర్ పర్సన్ బిందు, బయ్యారం పి ఏ సి ఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ కోటిరెడ్డి, అదనపు ఎస్పీ యోగేష్ గౌతమ్, ఇతర అధికారులు నేతలు ఉన్నారు.

ప్రమాదంలో మరణించిన మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రవి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే