ఆడపిల్లని అమ్మేశారు: మగపిల్లాడని ఐదు నెలల తర్వాత పోలీసులకు ఫిర్యాదు

Published : Oct 30, 2020, 12:03 PM IST
ఆడపిల్లని అమ్మేశారు: మగపిల్లాడని  ఐదు నెలల తర్వాత పోలీసులకు ఫిర్యాదు

సారాంశం

బిడ్డను విక్రయించిన ఐదు మాసాల తర్వాత తమకు అప్పగించాలని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


హైదరాబాద్: బిడ్డను విక్రయించిన ఐదు మాసాల తర్వాత తమకు అప్పగించాలని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

హైద్రాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన మీనా, వెంకటేష్ లు తమకు ఆడపిల్ల పుడితే అమ్మకానికి పెట్టాలని భావించారు. అదే  సమయంలో కాప్రా సర్కిల్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న రాజేష్ దంపతులకు పిల్లలు లేకపోవడంతో పిల్లలను దత్తత తీసుకోవాలని భావించారు.

రాజేష్ కు వెంకటేష్ దంపతుల విషయం తెలిసింది. ఆడపిల్ల పుడితే ఇస్తామని వెంకటేష్ మీనా దంపతులు అంగీకరించారు. ఈ విషయమై ఈ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ జరిగింది.

ఈ ఏడాది జూలై 19న రాజేష్ బాధితురాలిని తన చెల్లెలుగా ఈఎస్ఐ ఆసుపత్రిలో చేర్పించాడు. డెలీవరీ అయిన మీనా నుండి బిడ్డను రాజేష్ తీసుకొన్నాడు. 

అయితే తనకు ఆడపిల్ల పుట్టిందని చెప్పి రాజేష్ దంపతులు కొడుకును తీసుకొన్నారని వెంకటేష్, మీనా దంపతులు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. ఆడపిల్ల పుట్టిందని చెప్పి మధ్యవర్తి తన కొడుకు అమ్మేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. 

ఈ విషయమై పోలీసులు బాబును చైల్డ్ వేల్పేర్ కమిటీకి అప్పగించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!