రాష్ట్ర విభజన రహస్యం చెప్పిన వెంకయ్య

First Published Aug 21, 2017, 12:55 PM IST
Highlights
  • కలిసి కలహించుకోవడం కంటే విడిపోవడమే నయం
  • ఎవరికో వ్యతిరేకంగా జరిగిన విభజన కాదు
  • ఎవరి పాలన వారు చేసుకునేందుకే జరిగిన విభజన
  • తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నా వంతు పనిచేస్తా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన రహస్యాన్ని వెల్లడించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఎందుకు రాష్ట్ర విభజన జరిగిందో ఆయన తనదైన శైలిలో వివరించారు. రాజ్ భవన్ లో జరిగిన పౌర సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఎవరికో వ్యతిరేకంగా జరిగింది కాదని స్పస్టం చేశారు వెంకయ్య. ఎవరి పాలన వారు చేసుకునేందుకు, ఎవరి నిధులు వారు ఖర్చు చేసుకునేందుకు, ఎవరి అభివృద్ధిని వారే చేసుకునేందుకు మాత్రమే రాష్ట్ర విభజన జరిగింది తప్ప ఎవరికి వ్యతిరేకంగా కాదని స్పష్టం చేశారు వెంకయ్య. కలిసి ఉండి కలహించుకోవడం కంటే విడిపోయి బాగుపడడమే మేలు అనే ఉద్దేశంతోనే రాష్ట్రవిభజన జరిగిందని వివరించారు. వెంకయ్య ఈ మాటలు అనగానే సభలో చప్పట్లు మారుమోగాయి.

ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేనని, అయినా ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబు అద్భుతంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చేపడతారని ఆకాంక్షించారు. ఇద్దరు సిఎంలు తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడాలని ఆకాంక్షించారు.

తాను 1978లో హైదరాబాద్ లో వచ్చానని గుర్తు చేసుకున్నారు వెంకయ్య.ఈ 40 ఏళ్ల కాలంలో హైదరాబాద్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ తో తనకున్న అనుబంధం కారణంగానే ఇక్కడి నుంచే తన అధికారిక పర్యటన ప్రారంభించాలని భావించినట్లు చెప్పారు. ఆ విషయాన్ని తానే స్వయంగా కేసిఆర్ కు చెప్పినట్లు వివరించారు. దీనికి స్పందించిన సిఎం కెసిఆర్ తనకు పౌర సన్మానం ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు. హైదరాబాద్ నుంచే తన అధికారిక పర్యటన ప్రారంభించడం సంతోషకరమన్నారు.

ఉపరాష్ట్రపతి పదవి చాలా పెద్దదని, కానీ ఇందులో ఉండే పరిమితులు కూడా ఉంటాయన్నారు. సహజంగా పలకరించుకోలేని జీవితం ఎందుకని ప్రశ్నించారు. ప్రజలతో కలిసి మెలిసిన తనకు ఈ పదవిలో ఇమిడిపోవడం కొంత సమయం పడుతుందన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ పై వెంకయ్య ప్రశంసల వర్షం కురిపించారు. కెసిఆర్ భాష, ప్రసంగం షడ్చుచులతో కూడినదని చమత్కరించారు. గతంలో మాదిరిగా ఇక్కడికి తరచుగా రాలేనని, వచ్చినా గతంలో మాదిరిగా కలుసుకోలేమని చెప్పారు వెంకయ్య. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

click me!