ప్రాంతీయ భాషల్లో జర్నలిజం కోర్సులు

First Published Nov 6, 2016, 2:06 AM IST
Highlights
  • కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వెల్లడి

ప్రాంతీయ భాషలలో జర్నలిజమ్ కోర్సులను ప్రవేశపెట్టాలని, దీనిపై ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ కసరత్తు చేస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడించారు. సాలార్‌జంగ్ మ్యూజియం ఆడిటోరియంలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఉర్దూ జర్నలిస్టులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉర్దూ ఎంతో తీయనైన భాష, శతాబ్దాల తరబడి భారతీయ సంస్కృతిని సంపన్నం చేసిందని ప్రశంసించారు.  ఉర్దూ సాహిత్యంలో గొప్ప తత్వ సంపద ఇమిడి ఉందన్నారు.

నూతన సాంకేతిక విజ్ఞాన పద్ధతులను వినియోగించుకోవడంలో ఉర్దూ జర్నలిజమ్ ముందుండాలని కోరారు.  ఇటీవల కాలంలో ముస్లిం సోదరులు కూడా ఉర్దూకు దూరంగా వెళ్తున్నారని తెలిపారు. మాతృభాషను ప్రేమించలేనప్పుడు దేనిని ప్రేమించలేమని చెప్పారు. సమాజంలో మీడియా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. దూరదర్శన్‌లో ఉర్దూ వార్తల నిడివిని పెంచుతామని తెలిపారు. కాగా,
తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఐ అండ్ పీఆర్ కమిషనర్ నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులను మంజూరు చేస్తున్నాం, రూ. 5 లక్షల ప్రమాదబీమా కల్పించామని తెలిపారు. డెస్క్ జర్నలిస్టులతో పాటు మండల, జిల్లా స్థాయిల్లో పని చేసే ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు అందజేస్తామన్నారు.

 

 

click me!