వీసా చూడాలి.. కేరక్టర్ స్టడీ చేయాలి

Published : Nov 05, 2016, 07:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
వీసా చూడాలి.. కేరక్టర్ స్టడీ చేయాలి

సారాంశం

ఎన్ఆర్ఐ పెళ్లిలంటే తొందర పడకండి అన్ని పరిశీలించాకే పెళ్లి పీటలెక్కండి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యుల సూచనలు

‘‘ఎన్‌ఆర్‌ఐ పెళ్లి సంబంధమంటే ముందువెనుక ఆలోచించకుండా పెళ్లికి రెడీ అయిపోకండి.. ముందు అబ్బాయి వ్యవహారశైలిని పూర్తిగా తెలుసుకోండి. వీసా నుంచి కేరక్టర్ వరకు అన్ని స్టడీ చేశాకే పెళ్లి పీటలెక్కడి ’ అంటున్నారు మహిళా కమిషన్ సభ్యులు...శనివారం హైదరాబాద్లోని ప్లాజా హోటల్‌లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాణ వెంకటరత్నం అధ్యక్షతన ‘ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్లు-సమస్యలు’  అంశంపై సమావేశం జరిగింది.
రాజ్యసభ సభ్యులు కేశవరావు, పోలీసు ఉన్నతాధికారులు సౌమ్య మిశ్రా, స్వాతిలక్రా, సీనియర్ న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్‌ఆర్‌ఐ సంబంధాలు బెడిసి కొడుతున్నాయి. అలా బలైన మహిళలకు న్యాయం చేయలేకపోతున్నాం  అని మహిళా కమిషన్ సభ్యులు ఈ సమావేశంలో తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌ఐ పెళ్లిలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భారీ మార్పులు చేయాలని, ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ప్రొఫార్మాలో అబ్బాయి/అమ్మాయి పాస్‌పోర్టు వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఇందుకు కమిషన్ తరపున లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తే సరిపోతుందని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఉమాపతి సూచించారు. ఎన్‌ఆర్‌ఐలతో పెళ్లి తర్వాత భాగస్వామిని విదేశాలకు తీసుకెళ్లకుండా ఇబ్బందులు పెడుతున్న సందర్భాలు వెలుగు చూస్తున్నాయి. అయితే వారిపై కేసులు పెడితే విదేశాల్లో చెల్లడం లేదని, దీంతో వారిపై చర్యలు క్లిష్టతరమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ముందుగా తల్లిదండ్రుల వైఖరిలో మార్పు వస్తేనే ఫలితం ఉంటుందన్నారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ చురుకుగా పనిచేయడం లేదని, కొత్త రాష్ట్రంలో కమిషన్ మరింత బలోపేతం కావాల్సిన ఆవశ్యకత ఉందని ఎన్జీఓలు అభిప్రాయపడ్డారు. మైనార్టీ కుటుంబాల్లోని మహిళలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా విదేశీయులతో పెళ్లిళ్లకు అంగీకరిస్తున్నారని, దుబాయ్, అబుదాబీ, ఒమన్, సుడాన్ దేశాల్లో హైదరాబాద్‌కు చెందిన అమ్మాయిలు నరకం అనుభవిస్తున్నట్లు సమావేశంలో బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వచ్చిన సూచనలు, సలహాలు జాతీయ కమిషన్‌కు సమర్పించనున్నట్లు కమిషన్ పేర్కొంది

 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?