వేములవాడలో గ్యాంగ్ వార్: 20 నిముషాలపాటు రణరంగం

By Sreeharsha GopaganiFirst Published Jun 22, 2020, 6:52 AM IST
Highlights

నిన్న వేములవాడ పరిధిలో జరిగిన గ్యాంగ్ వార్ లో.... యువకులు రెండు వర్గాలుగా విడిపోయి మండల పరిషత్ కార్యక్రమం ముందు వీరంగం సృష్టించారు. వారి కొట్లాటను చూసిన ప్రజలు భయంతో వణికిపోయారు. 

సంచలనం సృష్టించిన విజయవాడ గ్యాంగ్ వార్ ఘటనను మనం మరిచిపోకముందే.... మొన్ననే హైదరాబాద్ శివారుల్లో కత్తులతో ఒక గ్యాంగ్ వార్ జరిగింది. ఈ రెండు గ్యాంగ్ వారుల్లో ఆర్థికలావాదేవీలు కారణంగా కనబడుతున్నాయి. 

కానీ నిన్న వేములవాడ పరిధిలో జరిగిన గ్యాంగ్ వార్ లో మాత్రం ఇటువంటి ఏ కారణం లేకున్నప్పటికీ.... యువకులు రెండు వర్గాలుగా విడిపోయి మండల పరిషత్ కార్యక్రమం ముందు వీరంగం సృష్టించారు. వారి కొట్లాటను చూసిన ప్రజలు భయంతో వణికిపోయారు. 

పోలీసులు వారి రణరంగాన్ని చిత్రీకరించారు. దాదాపుగా 20 నిముషాలపాటు వారు రణరంగాన్ని తలపించేలా కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు అందుబాటులో ఉన్న రాళ్ళూ రప్పలు తీసుకొని కొట్టుకున్నారు. వారి గ్యాంగ్ వార్ దెబ్బకు ఒక్కసారిగా పట్టణమంతా అవాక్కయింది. 

ద్విచక్ర వాహనంపై అతివేగంగా వెళ్తున్నాడని ఒక యువకుడిని మందలించడంతో... ఆయువకుడు వెళ్లి తన మనుషులను తీసుకొని వచ్చాడు. దానితో... ఒక్కసారిగా ఇరు వర్గాలు తలపడ్డారు. 20 నిమిషాలపాటు ఈ రణరంగం కొనసాగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇకపోతే.... విజయవాడ గ్యాంగ్‌వార్ ఘటనపై పోలీసులు కఠిన నిర్ణయం తీసుకొన్నారు. గ్యాంగ్‌వార్‌ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నగర బహిష్కరణ చేస్తున్నట్టుగా పోలీసులు సోమవారం నాడు ప్రకటించారు.

గత నెల 30వ తేదీన విజయవాడ పటమటలో సందీప్, పండు అలియాస్ మణికంఠ గ్యాంగ్‌లు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సందీప్ ఈ గత నెల 31వ తేదీన మరణించారు.

ఈ ఘర్షణలో పాల్గొన్న పండు జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. విచారణ చేస్తున్నారు. సందీప్, పండు గ్యాంగ్ వార్ ల ఘటనలో ఇప్పటికే రెండు గ్యాంగ్ లకు చెందిన 37 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మణికంఠ తల్లిపై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ రెండు గ్యాంగ్‌ల్లో ఉన్న వారిని నగరం నుండి బహిష్కరిస్తున్నట్టుగా ఇప్పటికే డీసీపీ ప్రకటించారు. 

click me!