ఒరిజినల్ నే ఓడగొట్టినం.. నువ్వొక డూప్లికేట్

Published : Nov 08, 2017, 07:32 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
ఒరిజినల్ నే ఓడగొట్టినం.. నువ్వొక డూప్లికేట్

సారాంశం

కేటిఆర్ పై ఘాటైన విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి సిరిసిల్లలో దళితులను మీ చుట్టాలు కొట్టి హింసించారు సిరిసిల్లలో భూములు కొల్లగొడుతున్నారు ఒరిజినల్ ఎన్టీఆర్ నే కల్వకుర్తి జనాలు ఓడగొట్టిర్రు. నువ్వు డూప్లికేట్ రామారావు నువ్వో లెక్కా?

కేటిఆర్ మీద కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి గరం గరం కామెంట్స్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో వంశీ మాట్లాడారు. కేటిఆర్ గురించి, కేసిఆర్ గురించి వంశీ ఏమన్నారో ఆయన మాటల్లోనే చదువుదాం.

నేను ఎప్పుడు కూడా సాధారణంగా అంశాల మీద ,సిద్ధాంతాల మీద వ్యక్తుల మీద మాట్లాడడం జరగలేదు. కానీ నిన్న కేటీఆర్ వ్యక్తిగతంగా నా పేరు తీసుకొని మాట్లాడిండు. కాబట్టి ఈరోజు నా కల్వకుర్తి ప్రజల కోసం మాట్లాడుతున్నాను.

వంశీచంద్ నిరోధకుడు అని కేటిఆర్ ఆరోపించిండు. కల్వకుర్తిలో అభివృద్ధి శూన్యం అని మాట్లాడిండు. నిన్న గాని ఇంతకు ముందు గాని కాంగ్రేస్ నుండి టీఆరెస్ లో ఎవరెవరు చేరారో వారందరూ చెయ్యి గుర్తు నుండి పోటీచేసిన వారే కదా? వారంతా తమ పదవులకు రాజీనామా చేసి మళ్ళీ గెలుమను. దీనిపై నేను సవాల్ చేస్తున్న కేటీఆర్ కు.

ఏదైతే అభివృద్ధి నిరోధకుడు అని నన్ను అన్నాడో ఆయనను అడుగుతున్నా.. ఫార్మా సిటీ కోసం మీరు, మీ కుటుంబం లోని కొంత మంది బంధువులు ఫార్మాసిటీ పేరుతో భూములు లాక్కున్నారు.

123 జీవో ప్రకారం భూమిని అక్రమంగా భూమిని లాకున్నారు కనుక మేము ఫార్మా సిటీ ని అడ్డుకుంటాం. మీ నియోజకవర్గంలో అక్తమంగా మీ బందువులు ఇసుక రవాణా లో దళితులను కొట్టారు. సిరిసిల్లలో మీ బంధువులు అక్రమంగా ల్యాండ్ సేకరణ చేస్తున్నారు. మీరూ 2013 చట్టం ప్రకారం భూమి ని సేకరించకుండా పేదలను మోసం చేస్తున్న మీ బంధువుల పైన సీఐడీ ఎంక్వయిరి వేయండి. అప్పుడు మీ అక్రమాలు బయట పడతాయి.

మేము ప్రాజెక్ట్ నిర్మించలేదు అని కానీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మేమే 90 శాతం పూర్తి చేస్తే దాన్ని మిరే చేసినట్లు చెప్తున్నారు ఇది దుర్మార్గం. కల్వకుర్తి కి నష్టం జరుగుతుందని పాలమూరు రంగారెడ్డి కి నీళ్ల తరలింపు వద్దు అని మీ మంత్రులు ముఖ్యమంత్రి లేఖ రాస్తే కూడా మీరు డిండి నుండి నీరు విడుదల చేశారు కదా? ఫార్మా సిటీలో ఉద్యోగాలు కల్పిస్తాం అని కేటిఆర్ చెప్పడం ఒక జోక్. ఎందుకంటే మీ నాయన దళితుడినే తొలి ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తా న్నాడు ఎం అయిందో చెప్పాలి.

ఒరిజినల్ తారకరామారావు నే ఓడగొట్టిర్రు కల్వకుర్తి ప్రజలు. ఈ డూప్లికేట్ తారకరామారావు మా కల్వకుర్తి ప్రజలకు ఒక లెక్క కాదు. నందమూరి తారక రామారావును కల్వకుర్తిలో ఓడగొట్టిన వ్యక్తి చిత్తరంజన్ పేరు ఇంకా మారుమోగిపోతూనే ఉన్నది. 

 ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది ఫార్మా సిటీ కావాలి అని మేడిపల్లి ప్రజలు అంటే నేను ముక్కు నేలకు రాస్తాను. కాంగ్రెస్ నుండి వచ్చిన ప్రజాప్రతినిధులు దమ్ముంటే కారు గుర్తు మీద పోటీచేసి గెలవమనండి. ఇది కేటిఆర్ కు నా సవాల్.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీధర్ బాబుకు ముందస్తు బెయిల్

హైదరాబాద్ లో అడుక్కుతింటే కుదరదు

కొలువుల కొట్లాటకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

https://goo.gl/ub9U8d

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా