తెలంగాణ కాంగ్రెస్ యువనేతకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు.. రేవంత్‌ రెడ్డికి చెక్?

By team teluguFirst Published Oct 28, 2021, 10:17 AM IST
Highlights

రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గంగా ఉన్న కొందరు సీనియర్లు పార్టీ అధిష్టానం తీసుకన్న నిర్ణయం పట్ల ఆనందపడుతున్నారు. అదేమిటంటే.. తెలంగాణ కాంగ్రెస్ యువనేత చల్లా వంశీచంద్‌రెడ్డికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. 

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియమితులు కావడం పార్టీలో ఒక విధమైన జోష్ నింపిందనే చెప్పాలి. చాలా మంది పార్టీ కార్యకర్తలు రేవంత్‌ రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పగించడంపై ఆనందం వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకం జరిగి ఇన్ని నెలలు గడుస్తున్న కొందరు కాంగ్రెస్ సీనియర్లు మాత్రం ఆయనపై గుర్రుగానే ఉన్నారు. పీసీసీ పీఠంపై ఆశలు పెట్టుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే నేత జగ్గారెడ్డి.. రేవంత్‌పై విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత ప్రచారం కోసం ఆరాటపడితే కాంగ్రెస్ పార్టీలో కుదరదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఆ తర్వాత టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ జోక్యంతో.. ఈ వివాదం సద్దుమణిగింది. అయితే ఇంకొందరు నేతలు బయటకు ఎటువంటి కామెంట్స్ చేయకపోయినా.. రేవంత్‌ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

అయితే Revanth Reddy వ్యతిరేక వర్గంగా ఉన్న కొందరు సీనియర్లు పార్టీ అధిష్టానం తీసుకన్న నిర్ణయం పట్ల ఆనందపడుతున్నారు. అదేమిటంటే.. తెలంగాణ కాంగ్రెస్ యువనేత చల్లా వంశీచంద్‌రెడ్డికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు.  ప్రస్తుతం మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూస్తున్న వంశీచంద్ రెడ్డికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కి సహాయకుడిగా నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. 

Also read: పరుగులు పెడుతున్న ఇంధన ధరలు.. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 120 దాటేసింది..

ఈ ఉత్వర్వలుపై సంతకం చేసిన సోనియా గాంధీ.. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలపై Vamshi Chand Reddy సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి థాంక్సూ చెప్పారు. తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. ఇక, వంశీచంద్‌రెడ్డి కాంగ్రెస్ విద్యార్థి విభాగ నాయకుడిగా.. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అధిష్టానం వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్న వంశీచంద్‌రెడ్డికి తాజాగా KC Venugopal కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగించారు. 

Also raed: Huzurabad bypoll:బండి సంజయ్, రేవంత్ కి ప్రతిష్టాత్మకం, సర్వ శక్తులను ఒడ్డుతున్న నేతలు

వంశీచంద్‌ రెడ్డికి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడం.. రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న నేతలు కొంత ఆనందపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వంశీచంద్‌ రెడ్డి.. రేవంత్ రెడ్డి అనుకూల వర్గం నేత కాకపోవడమే ఇందుకు కారణం. ఇకపై రేవంత్.. తెలంగాణలోని పార్టీ సీనియర్లను సంప్రదించకుండా సంస్థాగత విషయాలపై తీసుకునే నిర్ణయాలు వంశీచంద్ రెడ్డి ద్వారానే సాగించాల్సి వస్తుందని వారు భావిస్తున్నారు. 

రేవంత్ తీసుకునే నిర్ణయాలతో పాటుగా, రాష్ట్రంలోని పరిస్థితులపై ఏఐసీసీ కార్యాలయానికి సమాచారం చేరడానికి వంశీ సాయపడతాడని కూడా మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ వ్యవహారాలపై పర్యవేక్షణ కోసమే ఏఐసీసీ ఈ నియామకం చేపట్టిందా..?  అనే చర్చ కూడా సాగుతుంది. 
 

click me!