వామన్‌రావు దంపతుల హత్య: ఆయుధాల కోసం సుందిళ్ల బ్యారేజీలో గాలింపు

By narsimha lode  |  First Published Feb 28, 2021, 2:40 PM IST

అడ్వకేట్ వామన్ రావు దంపతులను హత్య చేసేందుకు ఉపయోగించిన ఆయుధాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


పెద్దపల్లి:  అడ్వకేట్ వామన్ రావు దంపతులను హత్య చేసేందుకు ఉపయోగించిన ఆయుధాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం కల్వచర్లలో నడిరోడ్డుపై దుండగులు వామన్ రావు దంపతులను హత్య చేశారు. హత్య చేసిన తర్వాత సుందిళ్ల బ్యారేజీలో ఆయుధాలను వేసి మహారాష్ట్రకు వైపునకు పారిపోయారు.

Latest Videos

వామనర్ రావు హత్య కేసులో నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకొన్నారు. పోలీసుల కస్టడీలో  ఉన్న నిందితులు తెలిపిన సమాచారం మేరకు  సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు.  సుందిళ్ల బ్యారేజీలో ఆయుధాలను రికవరీ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

బ్యారేజీలో ఆయుధాలను బయటకు తీసేందుకు విశాఖపట్టణం నుండి గజ ఈతగాళ్లను పోలీసులు రప్పించారు. ఇవాళ సుందిళ్ల బ్యారేజీ(పార్వతి) లో ఆయుధాల కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ బ్యారేజీ వద్ద పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ కేసుకు సంబంధించి అన్ని రకాల సాక్ష్యాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయుధాల కోసం గాలిస్తున్నారు.
 

click me!