హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు దుర్మరణం

Published : Feb 28, 2021, 09:47 AM IST
హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు దుర్మరణం

సారాంశం

షాద్ నగర్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. 

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  బైపాస్ రోడ్డు సమీపంలోని వైజంక్షన్ వద్ద వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు. 

హైదరాబాద్ నుండి కర్నూల్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  వేగంగా దూసుకొచ్చిన కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమర్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. 

 

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో 22A భూముల వివాదం.. అసలేంటీ సెక్షన్? ఎందుకీ గందరగోళం? పరిష్కారం ఏంటి.?
భ‌విష్య‌త్తులో ఈ ప్రాంతం మ‌రో లింగంప‌ల్లి కావ‌డం ఖాయం.. హైద‌రాబాద్‌కి 40 కి.మీల దూరంలో