టీఆర్ఎస్ సభ్యత్వం ఉంటేనే ప్రభుత్వ పథకాలు: ఎమ్మెల్యే రాజయ్య సంచలనం

Published : Feb 28, 2021, 12:00 PM ISTUpdated : Feb 28, 2021, 12:03 PM IST
టీఆర్ఎస్ సభ్యత్వం ఉంటేనే ప్రభుత్వ పథకాలు: ఎమ్మెల్యే రాజయ్య సంచలనం

సారాంశం

టీఆర్ఎస్ సభ్యత్వం ఉంటేనే  ఇక ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని  జనగామ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

జనగామ: టీఆర్ఎస్ సభ్యత్వం ఉంటేనే  ఇక ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని  జనగామ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చిల్పూరు మండలం రాజవరం, సునావత్ తండాల్లో శనివారం నాడు టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి.  ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.పార్టీని రక్షించుకొనేందుకు ఇదే సరైన మార్గంగా ఆయన పేర్కొన్నారు.రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకూ కూడ ఇదే వర్తింపజేస్తామన్నారు.సభ్వత్వాల పెంపు కోసం తన స్వంత ఆసుపత్రిలో మెడికల్ రాయితీలు ఇస్తానని ఆయన ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

also read:గడ్డం తీయను: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య శపథం

తాను టార్గెట్ గా పెట్టుకొని టీఆర్ఎస్ సభ్యత్వనమోదును చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్టుగా రాజయ్య చెప్పారు. తాను లక్ష్యం సాధించేవరకు గడ్డం తీయనని ఆయన ప్రతిన బూనారు.గతంలో కూడ ఇదే తరహాలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడ వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు చేలరేగాయి.

గతంలో కంటే ఈ దఫా రికార్డుస్థాయిలో టీఆర్ఎస్ సభ్యత్వాన్ని నమోదు చేయించాలని టీఆర్ఎస్ చీప్ కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. దీంతో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు. నేతలు పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?