హత్య వెనక మాజీ మంత్రి, పెద్దపల్లి ఎమ్మెల్యే అలా చేశాడు: వామన్‌రావు తండ్రి సంచలన ఆరోపణలు

By Siva KodatiFirst Published May 8, 2021, 6:19 PM IST
Highlights

తన కొడుకు, కోడలు హత్యలో ఓ మాజీ మంత్రి పాత్ర వుందని సంచలన ఆరోపణలు చేశారు లాయర్ వామన్ రావు తండ్రి కిషన్ రావు. వాళ్లు వేసిన కేసుల్ని తట్టుకోలేక గత్యంతరం లేని పరిస్ధితుల్లో వామన్ రావు దంపతుల్ని హత్య చేశారని తెలిపారు. 

తన కొడుకు, కోడలు హత్యలో ఓ మాజీ మంత్రి పాత్ర వుందని సంచలన ఆరోపణలు చేశారు లాయర్ వామన్ రావు తండ్రి కిషన్ రావు. వాళ్లు వేసిన కేసుల్ని తట్టుకోలేక గత్యంతరం లేని పరిస్ధితుల్లో వామన్ రావు దంపతుల్ని హత్య చేశారని తెలిపారు.

ఈ హత్యలో గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి హైదరాబాద్ వరకు గల నేతల పాత్ర వుందన్నారు కిషన్ రావు. పుట్టా మధు దంపతుల్ని సరైన పద్ధతిలో ప్రశ్నిస్తే చాలా మంది పేర్లు బయటకు వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

దాడిలో తీవ్రంగా గాయపడ్డ తన కొడుకు బతికే అవకాశం వున్నా.. పెద్దపల్లి ఎమ్మెల్యే ఒకరు ఫోన్ చేసి మందులు ఇవ్వొద్దని చెప్పారని కిషన్ రావు ఆరోపించారు. పోలీసులు సరైన రీతిలో దర్యాప్తు చేయకపోతే కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా కోరుతానన్నారు కిషన్ రావు. 

Also Read:పుట్ట మధు చుట్టూ ఉచ్చు: వామన్ రావు దంపతుల హత్య కేసులో రూ. 2 కోట్ల సుపారీ?

కాగా, టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. న్యాయవాది దంపతులు వామన్ రావు, నాగమణి హత్య కేసులో ఆయనను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు.

వామన్ రావు తండ్రి కిషన్ రావు ఇటీవల ఇచ్చిన పిర్యాదు ఆధారంగా ఆయనను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

గత నెల 30వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన పుట్ట మధు మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్ గడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తిరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి, భీమవరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనను భీమవరంలోని ఓ హోటల్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. 
 

click me!