లాయర్ దంపతుల హత్య: బిట్టు శ్రీను పాత్రపై దిమ్మతిరిగే వాస్తవం వెల్లడి

Published : Feb 20, 2021, 08:32 AM ISTUpdated : Feb 20, 2021, 08:33 AM IST
లాయర్ దంపతుల హత్య: బిట్టు శ్రీను పాత్రపై దిమ్మతిరిగే వాస్తవం వెల్లడి

సారాంశం

బిట్టు శ్రీను పాత్ర ఉందని తేలడంతో వామన్ రావు, నాగమణి దంపతుల హత్య కేసు కీలకమైన మలుపు తిరిగింది. కుంట శ్రీనుతో వ్యక్తిగత కక్షలు మాత్రమే కాకుండా మరో కారణం కూడా వారి హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

పెద్దపల్లి: లాయర్ దంపతుల హత్య కేసులో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను పాత్ర వెలుగులోకి వచ్చింది. కుంట శ్రీనుతో వామన్ రావు దంపతులకు విభేదాలు, కోపతాపాలు ఉన్న మాట నిజమే. కానీ, బిట్టు శ్రీనుకు వారిపై ఉన్న కక్ష ఏమిటనేది దాదాపుగా తేలిపోయినట్లు తెలుస్తోంది. బిట్టు శ్రీను పాత్రతో వామన్ రావు, నాగమణి దంపతుల హత్య కేసు మరో మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 

బిట్టు శ్రీనును శుక్రవారం పోలీసులు మంథనిలో అదుపులోకి తీసుకున్నారు. కుంట శ్రీను తనతో ఉన్న వ్యక్తిగత విభేదాల వల్లనే వామన్ రావు దంపతులను హత్య చేశారని భావిస్తూ వచ్చారు. కానీ, కుంట శ్రీనును విచారించిన తర్వాత బిట్టు శ్రీను పాత్ర వెలుగులోకి వచ్చింది. బిట్టు శ్రీను పక్కాగా పోలీసుల చేతికి ఆధారాలతో చిక్కాడు. 

Also Read: లాయర్ దంపతుల హత్య: వామన్ రావు భార్య నాగమణి ఆడియో వైరల్

హత్యకు నిందితులు వాడిన కారు, ఆయుధాలు బిట్టు శ్రీను అందించాడని తేలడంతో కేసు కీలకమైన మలుపు తీసుకుంది. మంథని పట్టణంలోని ఓ స్థలంలో లభించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీలో బిట్టు శ్రీను పాత్రపై కీలక ఆధారం రికార్డయింది. కుంట శ్రీనుకు బిట్టు శ్రీను నేరుగా ఆయుధాలు అందిస్తున్న దృశ్యం ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దాన్ని చూపించడంతో బిట్టు శ్రీను జంట హత్యల కేసులో తన పాత్రను అంగీకకరించక తప్పలేదని అంటున్నారు. 

బిట్టు శ్రీనుకు వామన్ రావు దంపతులపై ఉన్న కక్ష ఏమిటనే దానికి కూడా కాస్తా ఆధారం లభించింది. తన తల్లి లింగమ్మ పేరిట పుట్ట మధు ఓ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దానికి పుట్ట మధు మేనల్లుడైన బిట్టు శ్రీను చైర్మన్ గా ఉన్నాడు. చారిటబుల్ ట్రస్ ఆదాయవ్యయాలపై తప్పుడు లెక్కలు చూపిస్తూ నిధులు మళ్లిస్తున్నారని మాజీ వార్డు సభ్యుడు ఇనుముల సతీష్ 2018లో ఆదాయపు పన్ను శాఖకు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫిర్యాదు చేశారు. దానిపై వామన్ రావు భార్య  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు 

దాంతో ట్రస్ట్ నిర్వహణకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అదే ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో పుట్ట మధు ఓటమి పాలయ్యారు. దాంతో ట్రస్ట్ కార్యకలాపాలు ఆపేస్తున్నట్లు ప్రకటించారు. దానికి వామన్ రావు దంపతులే కారణమని బిట్టు శ్రీను భావించి కక్ష పెంచుకున్నట్లు చెబుతున్నారు. అందుకే వారి హత్యకు సహకరించినట్లు చెబుతున్నారు. 

Also Read: రెండు గంటల్లో ప్లాన్.. టార్గెట్ వామనరావు.. సాక్ష్యం ఉండొద్దనే భార్య హత్య

కాగా, జంట హత్య సంఘటనతో పుట్ట మధుకు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా సంబంధం ఉందని వామన్ రావు తండ్రి ఆరోపిస్తున్నారు. హత్య కేసుతో ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగానైనా పుట్ట మధుకు సంబంధం ఉందని ఆరోపించారు. దరఖాస్తు చేసేప్పుడు పోలీసులు చెప్పినట్టుగా రాశానని, నిందితులను మార్చివేశారని అన్నారు. గ్రామ కక్షలని చెప్తున్నారనీ.. తమకు శత్రువులు ఎవరూ లేరని, సుపారీ ఇచ్చి హత్య చేయించారని చెప్పారు. న్యాయవాదుల ద్వారా మళ్లీ పోలీసుల ముందు వాంగ్మూలం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నానని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?