ప్రేమిస్తున్నానంటూ వేధింపులు... బొమ్మ తుపాకీ తీసుకువచ్చి..

Published : Feb 20, 2021, 07:41 AM ISTUpdated : Feb 20, 2021, 07:45 AM IST
ప్రేమిస్తున్నానంటూ వేధింపులు... బొమ్మ తుపాకీ తీసుకువచ్చి..

సారాంశం

పెళ్లికి ఒప్పుకోవడం లేదంటూ ఆన్ లైన్ లో బొమ్మ తుపాకీ కొనుగోలు చేసి.. దానిని చూపించి బెదిరించాడు. 

ప్రేమిస్తున్నానంటూ ఓ యువతిని వేధించాడు. పెళ్లికి ఒప్పుకోవడం లేదంటూ ఆన్ లైన్ లో బొమ్మ తుపాకీ కొనుగోలు చేసి.. దానిని చూపించి బెదిరించాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన యువతి గీతాంజలి కళాశాలలో బీటెక్‌ చదువుతూ దమ్మాయిగూడ లేక్‌వ్యూ కాలనీలోని బంధువుల ఇంట్లో నివాసముంటోంది. దమ్మాయిగూడ సాయిబాబానగర్‌కు చెందిన అభిషేక్‌(20) అదే కళాశాలలో చదువుతూ యువతిని ప్రేమిస్తున్నానంటూ కొంత కాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు.

శుక్రవారం మధ్యాహ్నం యువతి సోదరుడు భానుప్రకాశ్‌ను పద్మశాలి టౌన్‌షిప్‌కు పిలిపించి ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న ఎయిర్‌గన్‌తో బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసులు అభిషేక్‌ను అదుపులోకి తీసుకుని ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడు ఉపయోగించిన ఎయిర్‌గన్‌ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన బొమ్మతుపాకీ అని పోలీసులు నిర్ధారించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం