పార్టీలో వుండలేనంటూ వ్యాఖ్యలు.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బుజ్జగింపులు, రంగంలోకి వీహెచ్

Siva Kodati |  
Published : Mar 19, 2022, 06:12 PM IST
పార్టీలో వుండలేనంటూ వ్యాఖ్యలు.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బుజ్జగింపులు, రంగంలోకి వీహెచ్

సారాంశం

పార్టీ మారుతానంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ  రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు వీ హనుమంతరావు రంగంలోకి దిగారు. 

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు (వీహెచ్) భేటీ అయ్యారు. అవమానం జరిగే చోట వుండలేనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ మారడంపై నిర్ణయం తీసుకుంటానని కోమటిరెడ్డి అన్నారు. పార్టీలో వున్న సమస్యలపై కలిసి మాట్లాడుకుందామని.. లేనిపక్షంలో అధిష్టానం వద్దకు వెళదామని వీహెచ్ అన్నట్లుగా తెలుస్తోంది. 

కాగా.. గత బుధవారం నాడు Komatireddy Rajagopal Reddy చౌటుప్పల్ లో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌరవం ఇవ్వని చోట తాను పార్టీలో ఉండనని చెప్పారు. ఎవరి కింద పడితే వారి కింద పని చేయలేనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారితే తనను నమ్మిన వారు తన వెంట రావొచ్చని కూడా ఆయన పిలుపునిచ్చారు.

KCR ను గద్దె దించడం కోసమే పార్టీ మారుతానని రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా  గట్టిగా పోరాటం చేసే పార్టీ ఏదైతే ఆ పార్టీలో ఉంటానని చెప్పారు.. Congress పార్టీ గట్టిగా TRS  కు వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదని భావిస్తే మరో పార్టీలోకి పోతామన్నారు. తాము పదవుల కోసం, డబ్బుల కోసం పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా అవసరమైతే తామే నిలబడుతామని ఆయన  చెప్పుకొచ్చారు. 

స్వార్ధం కోసం పార్టీ మారే ప్రసక్తే లేదన్న ఆయన.. ప్రజల కోసం త్యాగం చేస్తామన్నారు. తాను పార్టీ మారాలనుకొంటే ప్రజలతో చెప్పి మరీ పార్టీ మారుతానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు పార్టీ పదవుల కు కూడా resign చేస్తానన్నారు. మరో వైపు తాను తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని  చెప్పారు. తాను బీజేపీలో చేరుతున్నామని చెప్పామా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్నా కూడా పార్టీ లో కొనసాగుతున్న తమను పార్టీకి దూరం చేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.

ఇకపోతే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి కాంట్రాక్టర్ అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో సీఎల్పీ.. తనకు సరైన మద్దతు ఇవ్వలేదని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది.
 

PREV
click me!

Recommended Stories

Purandeswari Pays Tribute to NTR: ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన పురందేశ్వరి | Asianet News Telugu
NTR 30th Vardanthi: ఎన్టీఆర్ ఘన నివాళి అర్పించిన నందమూరి కళ్యాణ్ రామ్| Asianet News Telugu