ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలి: ఉత్తమ్

By narsimha lodeFirst Published Feb 15, 2021, 4:41 PM IST
Highlights

త్వరలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డి, రాములు నాయక్ లను గెలిపించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.సోమవారం నాడు ఆయన హైద్రాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
 

హైదరాబాద్: త్వరలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డి, రాములు నాయక్ లను గెలిపించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.సోమవారం నాడు ఆయన హైద్రాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు.

ఏ మాత్రం స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేస్తున్న వ్యక్తి మాజీ మంత్రి చిన్నారెడ్డి అని ఉత్తమ్ కొనియాడారు. రాములు నాయక్ కూడా నిరుపేద కుటుంబంలో పుట్టి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ ఇంతవరకు అమలు చేయలేదన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ కు దెబ్బ కొడితే నిరుద్యోగ భృతిని ఇస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

లక్షా 90 వేల ఉద్యోగాలు ఇప్పటికీ భర్తీ చేయలేదన్నారు. ఇవన్నీ రావాలంటే టీఆర్ఎస్‌ని చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. 43 శాతం ఫిట్మెంట్ తగ్గితే టీఆర్ఎస్‌ని ఓడించాలన్నారు.

బీజేపీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోంది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ని తీసుకురావడంలో బండి సంజయ్ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. 

 మేము కూడా హిందువులమే  అయోధ్య రామ మందిర నిర్మాణానికి మేము వ్యతిరేకం  కాదని ఆయన స్పష్టం చేశారు.. భద్రాచలం రామాలయం భూములు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది కేంద్రమేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

click me!