మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి షర్మిలతో భేటీ: ఏం జరుగుతోంది?

By narsimha lodeFirst Published Feb 15, 2021, 3:38 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి సోమవారం నాడు లోటస్‌పాండ్ లో వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి సోమవారం నాడు లోటస్‌పాండ్ లో వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి మాగం రంగారెడ్డి అత్యంత సన్నిహితుడిగా పేరుంది.కొంతకాలం క్రితం ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. రంగారెడ్డి సోమవారం నాడు లోటస్ పాండ్ లో షర్మిలతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

తెలంగాణలో త్వరలోనే షర్మిల రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారనే ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణలోని పలు జిల్లాల్లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో ఆమె సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో రంగారెడ్డి షర్మిలతో భేటీ కావడం చర్చకు దారితీస్తోంది.

రంగారెడ్డి షర్మిల పార్టీలో చేరుతారా లేదా అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు విషయమై షర్మిల కార్యక్రమాలను వేగవంతం చేసింది.

click me!