రైతులను కార్పోరేట్ శక్తులకు బలి ఇస్తున్నారు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై భట్టి ఫైర్

By narsimha lodeFirst Published Feb 15, 2021, 2:58 PM IST
Highlights

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను కార్పోరేట్ శక్తులకు బలి ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. 

నారాయణఖేడ్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను కార్పోరేట్ శక్తులకు బలి ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. రైతులతో ముఖాముఖి, పొలంబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నారాయణఖేడ్‌లో మీడియాతో మాట్లాడారు.

తమ పార్టీ రైతుల సమస్యలను పరిష్కరించుకొనేందుకు చేపట్టిన కార్యక్రమాలను చూసి కేసీఆర్ గుండెల్లో వణుకు పుట్టిందన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో రైతులు  తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. 

రైతుల కోసం తాను పర్యటిస్తున్నానని తన పర్యటన పదవుల  కోసం కాదని భట్టి విక్రమార్క ప్రకటించారు. తనపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు.హలియా బహిరంగసభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న యాత్ర గురించి కేసీఆర్ ఘాటుగానే విమర్శలు గుప్పించారు. 
 

click me!