పీసీసీ పదవికి ఉత్తమ్ గుడ్‌బై?: రేసులో వీరే

By narsimha lodeFirst Published Jun 5, 2019, 11:18 AM IST
Highlights

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్టుగా సమాచారం.  స్థానిక సంస్థల ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలు కావడంపై ఉత్తమ్  ఈ నిర్ణయం తీసుకొన్నారని సమాచారం.

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్టుగా సమాచారం.  స్థానిక సంస్థల ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలు కావడంపై ఉత్తమ్  ఈ నిర్ణయం తీసుకొన్నారని సమాచారం.

తెలంగాణ  రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవి నుండి తప్పుకొంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ  అధిష్టానానికి సంకేతాలు ఇచ్చారు.అయితే నెల రోజుల పాటు ఈ పదవిలో కొనసాగాలని పార్టీ జాతీయ నాయకత్వం ఉత్తమ్‌కు సూచించినట్టు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో నెల రోజుల పాటు ఈ పదవిలో కొనసాగేందుకు  ఉత్తమ్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  నల్గొండ ఎంపీ స్థానం నుండి  ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.

దీంతో హుజూర్ నగర్  అసెంబ్లీ స్థానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి  రాజీనామా చేయనున్నారు. ఈ నెల 6 వ తేదీన అసెంబ్లీ స్పీకర్ కు రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని ఒక్క జిల్లా పరిషత్ స్థానం  కూడ  కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో మూడు ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాల దృష్ట్యా ఉత్తమ్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయనున్నారు.

అయితే పీసీసీ చీఫ్ పదవి కోసం కోమటిరెడ్డి సోదరులతో పాటు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడ పోటీ పడుతున్నట్టుగా సమాచారం.

click me!