ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి ఏనాడు మునుగోడు‌ను పట్టించుకోలేదు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి

By Sumanth KanukulaFirst Published Sep 3, 2022, 2:04 PM IST
Highlights

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు లేవని విమర్శించారు. టీఆర్ఎస్ 8 ఏళ్లుగా రాష్ట్రాని దోచుకుంటుందని.. బీజేపీ మతపరమైన రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. 

మునుగోడులో శనివారం కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి జానా రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బోసురాజు, మల్లు రవి, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ మోసాలపై కాంగ్రెస్ చార్జిషీట్ విడుదల చేసింది. ఈ సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉన్నారు. చార్జిషీట్ విడుదల చేసిన అనంతరం కాంగ్రెస్ ముఖ్యనేతలు మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయని అన్నారు. ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు లేవని విమర్శించారు. 

ఎమ్మెల్యేగా మునుగోడును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టించుకోలేదని విమర్శించారు. టీఆర్ఎస్‌కు వామపక్షాల మద్దతివ్వడం బాధకరమని అన్నారు. టీఆర్ఎస్‌కు వామపక్షాల మద్దతును తెలంగాణ సమాజం అంగీకరించదని అన్నారు.  బీజేపీ కార్పొరేటర్లకు దోచిపెడుతూ.. రైతులను రోడ్డున పడేస్తోందని మండిపడ్డారు. మునుగోడులో ఏం అభివృద్ది చేశాయని టీఆర్ఎస్, బీజేపీలు ఓట్లు అడుగుతున్నాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ 8 ఏళ్లుగా రాష్ట్రాని దోచుకుంటుందని.. బీజేపీ మతపరమైన రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. 

రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరితే ఏం లాభమని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్‌తో దోస్తీ చేసి రాష్ట్రంలో కాంట్రాక్టులు తెచ్చుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీలో చేరి వేల కోట్ల కాంట్రాక్టులు తెచ్చుకున్నారని మండిపడ్డారు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోవాలని.. ఓటు మాత్రం కాంగ్రెస్‌‌కు వేయాలని కోరారు. 

click me!