సికింద్రాబాద్ రామ్‌గోపాల్‌పేట‌లోని ఓ ఇంట్లో పేలుడు.. ఇద్దరికి గాయాలు

Published : Sep 03, 2022, 01:04 PM IST
 సికింద్రాబాద్ రామ్‌గోపాల్‌పేట‌లోని ఓ ఇంట్లో పేలుడు.. ఇద్దరికి గాయాలు

సారాంశం

సికింద్రాబాద్ రామ్‌గోపాల్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ ఇంట్లో పేలుడు చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులో పేలుడు సంభవించడంతో.. చుట్టుపక్కల ప్రజలు భయాందోళన చెందారు.

సికింద్రాబాద్ రామ్‌గోపాల్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ ఇంట్లో పేలుడు చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులో పేలుడు సంభవించడంతో.. చుట్టుపక్కల ప్రజలు భయాందోళన చెందారు. భయంతో పరుగులు తీశారు. ఈ పేలుడు ధాటికి భవనం ధ్వంసం అయింది. పేలుడు ధాటికి ఇంట్లో ఉన్న దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటన స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. 

అయితే తొలుత ఇంట్లోని సిలిండర్ పేలిందని భావించారు. అయితే ఇంట్లో సిలిండర్ బాగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పేలుడుకు గల కారణాలు ఏమిటనేది తెలియాల్సి ఉంది. భవనంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. పేలుడు ఘటనపై విచారణ జరుపుతున్నట్టుగా చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే