మోదీకి కేసీఆర్ ఏజెంట్:పీసీసీ చీఫ్ ఉత్తమ్ ధ్వజం

By Nagaraju TFirst Published Oct 20, 2018, 6:57 PM IST
Highlights

 ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఏజెంట్ అని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్రలో పాల్గొన్న ఉత్తమ్ బీజేపీ,టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై నిప్పులు చెరిగారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ కు ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 
 

హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఏజెంట్ అని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్రలో పాల్గొన్న ఉత్తమ్ బీజేపీ,టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై నిప్పులు చెరిగారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ కు ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ బీజేపీకి మద్ధతిచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో కేసీఆర్,బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్ కు ఓటేస్తే అన్ని కులాలు, మతాలు ప్రజలు కలిసిమెలిసి జీవించొచ్చని స్పష్టం చేశారు. దేశంలో ఎప్పుడూ లేని విధంగా మోదీ గెలిచాక విధ్వంసం చెలరేగిందన్నారు. దేశ సమైక్యతను బీజేపీ దెబ్బతీసిందని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. ప్రజలను విభజించి పాలిస్తున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ప్రధానిమంత్రి అయితేనే దేశంలో మతసామరస్యం నెలకొంటుందని స్పష్టం చేశారు. 

మరోవైపు చార్మినార్‌లో ఓటు అడిగే హక్కు తనకే ఉందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తాను చార్మినార్ ఆస్పత్రిలోనే పుట్టానని అందుకే తనకు చార్మినార్ లో ఓటు అడిగే హక్కు ఉందని స్పష్టం చేశారు. 

click me!