కమిటీల్లో 50 మంది టీడీపీ నుంచి వచ్చినవారే.. 4 పార్టీలు మారినవారు పార్టీని ఉద్దరిస్తారా?: ఉత్తమ్ సంచలనలం

By Sumanth KanukulaFirst Published Dec 17, 2022, 2:04 PM IST
Highlights

కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఒరిజనల్ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని రక్షించుకునేందుకు సేవ్ కాంగ్రెస్‌ నినాదంతో ముందుకు వెళ్లనున్నట్టుగా చెప్పారు.

కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఒరిజనల్ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని రక్షించుకునేందుకు సేవ్ కాంగ్రెస్‌ నినాదంతో ముందుకు వెళ్లనున్నట్టుగా చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన టీపీసీసీ కమిటీలపై నెలకొన్న అసంతృప్తి నేపథ్యంలో భట్టి విక్రమార్క నివాసంలో పలువురు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఉత్తమ్  కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై చర్చించుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న కొన్ని విషయాలు చాలా బాధ కలిగించాయని అన్నారు. 

కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. తాను పీసీసీగా ఉన్నప్పుడూ తనను ఇష్టపడినవారు, వ్యతిరేకించిన వారు ఉన్నారని చెప్పారు. అయితే ఏ రోజు కూడా తానే అన్ని పోస్టుల్లో తనకు నచ్చినవాళ్లే ఉండాలనే ఆలోచన చేయలేదని తెలిపారు. తానే కాంగ్రెస్ పార్టీని క్యాప్చర్ చేసుకోవాలని ఆలోచన చేయలేదని.. వ్యతిరేకించినవారిని పార్టీలో ఎదగకుండా చేయాలని  అనుకోలేదని చెప్పారు. కొంతమందిని అవమానించడానికే డీసీసీల ప్రకటన జరిగిందని భావిస్తున్నట్టుగా చెప్పారు. 

Also Read: బలమైన నాయకులపై బద్నాం చేసేలా పోస్టులు.. పార్టీలో కుట్ర జరుగుతుందని నేతల్లో అనుమానాలు: భట్టి విక్రమార్క సంచలనం

క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి తాము రాజకీయం చేస్తున్నామని చెప్పారు. తాను కేవలం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. 33 జిల్లాల్లో.. 26 డీసీసీలను ప్రకటించి, 7 మాత్రమే ఆపారని.. ఎందుకంత హడావుడిగా చేశారో అర్థం కాలేదన్నారు. గెలిచే చోట డీసీసీల నియమాకాన్ని ఆపారని అన్నారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల్లో ఎక్కువ మంది బయటి పార్టీ నుంచి వచ్చినవారు ఉండటం మంచిది కాంగ్రెస్ పార్టీని కాదన్నారు. ఒక్కసారి పార్టీలో చేరిన తర్వాత అందరూ సమానమేనని అన్నారు. కానీ చాలా కాలంగా పార్టీలో ఉన్నవారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల్లో.. 50 మందికి పైగా టీడీపీ నుంచి వచ్చినవాళ్లే ఉన్నారని అన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిసి వారి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఒర్జినల్ కాంగ్రెస్ నాయకులు అందరూ కోవర్టులు అని తీన్మార్ మల్లన్న పోస్టులు పెడుతున్నారని.. నాలుగు పార్టీలు మారిన వ్యక్తి ఉద్దరిస్తాడని చెబుతున్నాడని మండిపడ్డారు. గలీజ్ సోషల్ మీడియా వ్యవహారం ఎవరూ చేస్తున్నారో తమకు తెలియదా? అని ప్రశ్నించారు. తీన్మార్ మల్లన్న ఏ పార్టీ, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. 

click me!