బలమైన నాయకులపై బద్నాం చేసేలా పోస్టులు.. పార్టీలో కుట్ర జరుగుతుందని నేతల్లో అనుమానాలు: భట్టి విక్రమార్క సంచలనం

By Sumanth KanukulaFirst Published Dec 17, 2022, 1:36 PM IST
Highlights

కాంగ్రెస్‌ పార్టీలో పుట్టి, పెరిగిన ఎంతోమందికి అన్యాయం జరుగుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. కొత్త కమిటీలో ఏర్పాటులో ఇబ్బంది కలిగిన మాట వాస్తమేనని చెప్పారు. 

కాంగ్రెస్‌ పార్టీలో పుట్టి, పెరిగిన ఎంతోమందికి అన్యాయం జరుగుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. కొత్త కమిటీలో ఏర్పాటులో ఇబ్బంది కలిగిన మాట వాస్తమేనని చెప్పారు. కమిటీ కూర్పు విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని అన్నారు. వలసవాదులతో అసలు కాంగ్రెస్ నాయకులకు నష్టం జరిగిందన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన టీపీసీసీ కమిటీలపై నెలకొన్న అసంతృప్తి నేపథ్యంలో భట్టి విక్రమార్క నివాసంలో పలువురు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మాతో సంప్రదించకుండా కమిటీలు ఎలా వేశారని సీనియర్ నేతలు నన్ను అడుగుతున్నారు. కమిటీల కూర్పు విషయంలో నన్ను ఎవరూ సంప్రదించలేదు. 

పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానని మనస్తాపానికి గురవుతున్నాను. కాంగ్రెస్‌లో పుట్టి, పెరిగిన నాయకులుగా పార్టీని రక్షించుకోవాల్సి  బాధ్యత మనందరిపై ఉందన్నారు. పార్టీని, కార్యకర్తలను రక్షించుకునేందుకు సేవ్ కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని భుజాలపైన వేసుకుని ముందుకు వెళ్లాలని నాయకులు చెప్పారు. తప్పకుండా ఆ దిశగా ముందుకు వెళ్తాం’’ అని చెప్పారు

‘‘బలంగా ఉన్న కాంగ్రెస్ నాయకులను కొందరు వ్యక్తిగతమైన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా క్యారెక్టర్‌ను బద్నాం చేసేలా పోస్టింగ్స్ చేస్తున్నారు. తద్వారా కాంగ్రెస్ నాయకులకే కాకుండా, పార్టీకి కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. అటువంటి వారిపై దృష్టి‌పెట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ రకంగా సోషల్ మీడియా కార్యక్రమాలు గత ఏడాదిన్నరగా సాగుతున్నాయి. ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చడానికి.. బలమైన నాయకులపై ఈ రకమైన సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరచి హస్తగతం చేసుకోవాలనో, ఇంకొకరికి అప్పజెప్పాలనో కుట్ర జరుగుతుందనే భావన కూడా కొంతమంది నాయకులు వ్యక్తపరిచారు. వీటన్నింటి దృష్ట్యా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత సీనియర్ నాయకులపై ఉంది’’ భట్టి విక్రమార్క అన్నారు. 

click me!