జగ్గారెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ ఉత్తమ్: ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకు

By telugu teamFirst Published May 11, 2019, 12:25 PM IST
Highlights

ఎమ్మెల్సీ ఎన్నికలపై తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని, సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. 

హైదరాబాద్: తమ పార్టీ జగ్గారెడ్డి వ్యాఖ్యలపై, ఆయన వ్యవహారశైలిపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తాను గాంధీభవన్ లో ఉంటానో, తెలంగాణ భవన్ లో ఉంటానో ఈ నెల 30వ తేదీలోగా వెల్లడిస్తానని జగ్గారెడ్డి ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. 

ఇదిలావుంటే, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను జిల్లా కాంగ్రెసు కమిటీ (డీసీసీ)లకు అప్పగించాలని కాంగ్రెసు పార్టీ నిర్ణయించింది. కుంతియాతో సహా కాంగ్రెసు ముఖ్య నేతలు శనివారం గాంధీ భవన్ లో సమావేశమై మూడు ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేసే విషయంపై చర్చించారు. 

ఎమ్మెల్సీ ఎన్నికలపై తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని, సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెసు ఇంకా స్పష్టతకు రాలేదని సమాచారం. 

ఈ సమావేశంలోనే పార్టీ తీరుపై వి హనుమంతరావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక తీరుపై ఆయన పార్టీ నాయకులను నిలదీశారు. 

click me!