షాద్ నగర్ రామ్ నగర్ లో మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళ మృతదేహన్ని మూటకట్టి రోడ్డు పక్కన వదిలేశారు దుండగులు.
హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ రామ్ నగర్ లో రోడ్డు పక్కన మహిళ మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. ఈవిషయమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనస్థలాన్ని పరిశీలించారు. మహిళ మృతదేహం మూట కట్టి ఉంది. మహిళ మృతదేహన్ని పోలీసులు షాద్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహం ఎవరిదనే విషయమై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.
గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో మహిళ మృతదేహలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. మహిళ మృతదేహన్ని సంచిలో చుట్టి దుండగులు వదిలివెళ్లారు. ఈ ఘటన 2017 ఫిబ్రవరిలో చోటు చేసుకుంది. మహిళ మృతదేహం దగ్దం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెంలో ఆవులను మేపేందుకు వెళ్లిన మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీన్ని ఆమె ప్రతిఘటించింది. దీంతో నిందితుడు ఆమెను హత్య చేశాడు. మృతదేహన్ని రోడ్డు పక్కనే బావిలో వేశాడు. ఈ ఘటన 2022 మే మాసంలో చోటు చేసుకుంది .హైద్రాబాద్ ఘట్ కేసర్ అంకుషాపూర్ రైల్వే ట్రాక్ పై మహిళ డెడ్ బాడీ లభ్యమైంది.మహిళను గుర్తు పట్టకుండా ఉండేందుకు గాను మహిళ ముఖం దగ్దం చేశారు. 2021 జనవరి 5న ఈ ఘటన చోటు చేసుకుంది.
2019 నవంబర్ మాసంలో షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద దిశ పై అత్యాచారం, హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దిశపై అత్యాచారం, హత్య చేసిన నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్ లో మృతి చెందిన విషయం తెలిసిందే.