తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ప్రభుత్వం నుండి ఆహ్వానం రాలేదని రాజ్ భవన్ ప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు ఎలాంటి ఆహ్వానం రాలేదని రాజ్ భవన్ ప్రకటించింది. తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందినా కూడా గవర్నర్ హాజరు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని గవర్నర్ తప్పు బట్టారు. కొత్త సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం నుండి ఆహ్వానం రానందున ఈ కార్యక్రమానికి గవర్నర్ హాజురు కాలేదని రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు రాజ్ భవన్ మీడియాకు ప్రకటన విడుదల చేసింది.
ఈ ఏడాది ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి 2500 మందికి ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. అయితే గవర్నర్ కు మాత్రం ఎలాంటి ఆహ్వానం రాలేదని రాజ్ భవన్ వర్గాలు తేల్చి చెప్పాయి. ప్రభుత్వం నుండి ఆహ్వానం అందనందునే గవర్నర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని రాజ్ భవన్ వర్గాలు తేల్చి చెప్పాయి.
తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ కొనసాగుతుంది. రోజు రోజుకి ఈ గ్యాప్ పెరుతూనే ఉంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ప్రారంభించారు. దీంతో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ తగ్గిందని భావించారు. కానీ గవర్నర్ తన వద్ద బిల్లులను ఆమోదించకుండా పెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారించింది. గత మాసంలోనే ఈ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
also read:కేసు క్లోజ్: గవర్నర్ తమిళిసైని తప్పు పట్టిన సుప్రీం
తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ కొనసాగుతుంది. రోజు రోజుకి ఈ గ్యాప్ పెరుతూనే ఉంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ప్రారంభించారు. దీంతో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ తగ్గిందని భావించారు
తెలంగాణ సచివాలయ ప్రారంభానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు ఆహ్వానం అందిందని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తమిళిసై ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయమై ఇవాళ రాజ్ భవన్ వర్గాలు స్పష్టత ఇచ్చింది.