హైద్రాబాద్ రాజేంద్రనగర్‌లో రాహుల్ సింగ్ హత్య: ప్రేమ వ్యవహరమే కారణమా?

Published : Aug 30, 2023, 10:37 AM ISTUpdated : Aug 30, 2023, 10:40 AM IST
హైద్రాబాద్ రాజేంద్రనగర్‌లో రాహుల్ సింగ్ హత్య: ప్రేమ వ్యవహరమే కారణమా?

సారాంశం

హైద్రాబాద్ రాజేంద్ర నగర్ లో  రాహుల్ సింగ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. రాహుల్ సింగ్  హత్యకు పాల్పడిన నిందితుల కోసం  నాలుగు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు.  

హైద్రాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ లో రాహుల్ సింగ్  అనే యువకుడిని  గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ హత్యకు  ప్రేమ వ్యవహరం కారణమనే పోలీసులు అనుమానిస్తున్నారు.   నగరంలోని ధూల్ పేటకు  చెందిన  రాహుల్ సింగ్   మణికొండలోని అలిజాపూర్‌లో నివాసం ఉంటున్నాడు.  తాను నివాసం ఉండే  ప్రాంతానికి సమీపంలోని జిమ్ కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో  నలుగురు దుండగులు కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి రాహుల్ సింగ్ ను హత్య చేశారు.

రాహుల్ సింగ్ తమ బంధువుల అమ్మాయితో ప్రేమ వ్యవహరం నడిపారు. అయితే  పెళ్లి విషయంలో  విబేధాలు వచ్చాయి.  ఈ విషయమై  రాహుల్ సింగ్ ను  హత్య చేసి ఉంటారనే అనుమానాలను పోలీసులు వ్యక్తం  చేస్తున్నారు. ఈ విషయమై  రాహుల్ సింగ్  మధ్యవర్తులను ఆశ్రయించినట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే  నిన్న  జిమ్ లో వ్యాయామం చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో రాహుల్ సింగ్  కళ్లలో కారం కొట్టి దుండగులు హత్య చేశారు.

 నలుగురు వ్యక్తులు రాహుల్ సింగ్  హత్యలో పాల్గొన్నట్టుగా  పోలీసులు  గుర్తించారు. ఈ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీని  పోలీసులు పరిశీలిస్తున్నారు.   రాహుల్ సింగ్  ను హత్య చేసిన నిందితుల కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.   రాహుల్ సింగ్ ను హత్య చేసిన తర్వాత  నిందితులు ఎటువైపు వెళ్లారనే విషయమై  పోలీసులు సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు.ఇదిలా ఉంటే  ఈ హత్యకు  ప్రేమే వ్యవహరం ఏ మేరకు కారణమనే విషయమై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad : ఈ శివారు ప్రాంతం మరో గచ్చిబౌలి కావడం ఖాయం.. ఇప్పుడే భూములు కొన్నారో మీ జాతకమే మారిపోతుంది
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు.. అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 10 ప్రాంతాలివే..