‘సుఖీభవ శరత్’పై దాడి... రక్తాలు కారేలా కొట్టిన దుండగులు.. కారణం అదేనా??

Published : Oct 19, 2021, 10:35 AM IST
‘సుఖీభవ శరత్’పై దాడి... రక్తాలు కారేలా కొట్టిన దుండగులు.. కారణం అదేనా??

సారాంశం

శరత్ తీవ్ర గాయాలతో ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలో శరత్ ముక్కు, నోట్లో నుంచి రక్తం కారుతోంది. ఏదో ఫంక్షన్ లో గొడవ జరిగిందని, అక్కడ శరత్ మీద దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. దీనిమీద గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో అనేక కథనాలు వెలుగు చూస్తున్నాయి. 

‘అయ్యయ్యో వద్దమ్మా..’ అంటూ.. ’సుఖీభవ.. సుఖీభవ..‘అంటూ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో సృష్టికర్త శరత్. ఓ టీ పౌడర్ యాడ్ ను రీ క్రియేట్ చేసి తనదైన శైలిలో తీన్మార్ స్టెప్పులు వేయడంతో ఇది కాస్తా వైరల్ గా మారింది. ఇది వైరల్ గా మారడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిన నల్లగుట్ట శరత్ పైన దాడి జరిగింది. శరత్ తీవ్ర గాయాలతో ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలో శరత్ ముక్కు, నోట్లో నుంచి రక్తం కారుతోంది. ఏదో ఫంక్షన్ లో గొడవ జరిగిందని, అక్కడ శరత్ మీద దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. దీనిమీద గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో అనేక కథనాలు వెలుగు చూస్తున్నాయి. 

అయ్యయ్యో వద్దమ్మ... అంటూ తెలుగు రాష్ట్రాల్లో సూపర్ వైరల్ అయిన Sukhibhava Sharath మీద దాడి జరిగింది.  రక్తం కారేలా తీవ్రంగా కొట్టారు. కొంతమంది అతడిని విచక్షణారహితంగా కొట్టారు. దాడికి కారణాలు తెలియాల్సి ఉంది.  అయితే, ఏదో ఈవెంట్ లో గొడవ జరిగి అతడిని కొట్టినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు శరత్ గాయాలతో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్  మీడియాలో వైరల్ అయ్యాయి.  సడెన్ గా స్టార్ డమ్ రావడంతో శరత్ మీద దాడి ప్రాముఖ్యత సంతరించుకుంది. 

కాగా హైదరాబాద్ నల్లగుట్ట కు చెందిన శరత్ సుఖీభవ అంటూ కొత్త ట్రెండ్ ను సృష్టించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా సుఖీభవ అనేవీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతుంది.  నల్లగుట్ట శరత్ ఒక టీ పౌడర్ యాడ్ ను రీ క్రియేట్ చేసి తీన్మార్ స్టెప్పులేయడం, అది కాస్త మీమ్స్ పేజీల ద్వారా ఇంటర్నెట్ లో వైరల్ కావడం తెలిసిందే.

‘Ayyayo vaddamma .. Sukhibhava..’ ఈ లైన్స్ వాడి Memes, trolls.. ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం కొన్ని యాడ్స్, సాంగ్స్ ఇలానే ట్రెండ్ అవున్నాయి. ఎప్పుడో వచ్చిన టీ పౌడర్ యాడ్ ఈ రీమిక్స్ తో ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది. 

ఫేస్ బుక్ పరిచయం.. వాట్సాప్ న్యూడ్ కాల్ చేయమంటూ ఒత్తిడి.. ఆ తరువాత...

హైదరాబాద్ కు చెందిన శరత్.. ఓ రోజు పెళ్లిడ్యాన్స్ లో భాగంగా డ్యాన్స్ వేస్తూ.. సరదాగా ‘అయ్యయ్యో వద్దమ్మా.. ఆ పక్కనే టీ కొట్టు ఉంది. అందరికీ ఓ కప్పు టీ ఇద్దామనుకున్నా.. సుఖీభవ.. సుఖీభవ..’ అంటూ పాటపాడి తీన్మార్ స్టెప్పులేశాడు. 

అంతే ఆ వీడియో Social mediaలో తెగ Viralఅయ్యింది. వైరల్ అవ్వడమే కాదు.. శరత్.. రాత్రికి రాత్రే Celebrityకూడా అయిపోయాడు. ఓవర్ నైట్ లో YouTube Star అయ్యాడు. అప్పటివరకు వెబ్ సిరీస్ లంటూ, యూట్యూబ్ వీడియోలంటూ ఎన్నిరకాలుగా ప్రయత్నించినా హిట్ కొట్టని శరత్ అనుకోకుండా చేసిన ఈ ప్రయత్నంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. 

ఈ యాడ్ ట్రాన్స్ జెండర్ ల గౌరవార్థం చేసినట్టుగా మనకు అది చూస్తే తెలుస్తుంది. అయితే దీన్ని శరత్ కించపరిచాడని వారే అతనిమీద దాడి చేశారని మరో వాదన వినిపిస్తుంది. అయితే దాడికి అసలు కారణమేంటో ఇప్పటివరకు తెలియరాలేదు. 

PREV
click me!

Recommended Stories

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వైభవంగా సీతారాముల కళ్యాణం | Sitaramula Kalyanam Bhadrachalam
Holidays : శ్రీరామనవమి నుండి జగ్జీవన్ రామ్ జయంతి వరకు... ఏకంగా పది రోజుల సెలవులే..!