ఒకటో తరగతి విద్యార్ధి హర్షవర్ధన్‌పై కత్తితో దాడికి దిగిన దుండగులు

Published : Jul 02, 2018, 04:35 PM IST
ఒకటో తరగతి విద్యార్ధి హర్షవర్ధన్‌పై కత్తితో దాడికి దిగిన దుండగులు

సారాంశం

గురుకుల పాఠశాల విద్యార్దిపై కత్తులతో దాడి


 

నిర్మల్: నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు  గురుకుల పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నవిద్యార్ధి హర్షవర్ధన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడికి దిగారు. బాధితుడు కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కుబీర్ మండలకేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు  పూలే గురుకుల పాఠశాలలో  హర్షవర్ధన్ అనే విద్యార్ధి ఒకటో తరగతి చదువుతున్నాడు. అయితే అతడిని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి కత్తులతో పొడిచారు. బాధితుడితో పాటు తోటి విద్యార్ధులు కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు.

అయితే హర్షవర్ధన్‌పై కత్తితో ఎవరు దాడి చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. హర్షవర్ధన్‌‌పై తోటి విద్యార్ధులు కత్తితో దాడి చేశారా... లేకపోతే ఇతరత్రా ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

హర్షవర్ధన్ స్వస్థలం లక్ష్మణ్‌చాందా మండలం చామన్‌పల్లి గ్రామం. విద్యాభ్యాసం కోసం హర్షవర్ధన్ గురుకుల పాఠశాలలో చేరారు. అయితే హర్షవర్ధన్‌పై ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం