ఎల్లుండి హైద్రాబాద్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. చేవేళ్లలో జరిగే బీజేపీ సభలో అమిత్ షా పాల్గొంటారు.
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారంనాడు హైద్రాబాద్ కు రానున్నారు. ఆదవారంనాడు సాయంత్రం మూడున్నర గంటలకు అమిత్ షా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు ఎయిర్ పోర్టు నుండి నేరుగా నోవాటెల్ హోటల్ కు చేరుకుంటారు. నోవాటెల్ హాటల్ లో ఆస్కార్ అవార్డు దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ తో కేంద్ర మంత్రి అమిత్ షా తేనీటి భేటీ ఏర్పాటు చేశారు.
సాయంత్రం 5:15 గంటలకు హోటల్ నుండి చేవేళ్లలో జరిగే సభకు వెళ్లనున్నారు. సాయంత్రం ఆరు గంటల నుండి 7:50 గంటల వరకు చేవేళ్ల సభలో పాల్గొంటారు. రాత్రి 7:50 గంటల సమయంలో ప్రత్యేక విమానంలో కేంద్ర మంత్రి అమిత్ షా హైద్రాబాద్ నుండి ఢిల్లీకి బయలుదేరనున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా చేవేళ్ల సభలో అమిత్ షా పాల్గొంటారు.
రాష్ట్ర పర్యటనకు వచ్చి న సమయంలో రాజకీయాలతో సంబంధం లేని ప్రముఖులను కేంద్ర మంత్రి అమిత్ షా కలుస్తున్నారు. గతంలో కూడా పలువురితో కేంద్ర మంత్రి సమావేశమయ్యారు.
గత ఏడాది ఆగస్టు 22న జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. గత ఏడాది ఆగస్టు 27న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సినీ నటుడు నితిన్, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ భే టీ అయ్యారు.
గత ఏడాది ఆగస్టు 22న జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. గత ఏడాది ఆగస్టు 27న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సినీ నటుడు నితిన్, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ భే టీ అయ్యారు.
తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ జాతీయ నాయకత్వం కేంద్రీకరించింది. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తెలంగాణలో ఈ దఫా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అవకాశం ఉన్న ప్రతీసారి బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం మరింత ఫోకస్ పెట్టనుంది.