మహారాష్ట్రలో టీఆర్ఎస్ పోటీ: కేసీఆర్ కు కేంద్ర మంత్రి సవాల్

By telugu teamFirst Published Sep 21, 2019, 10:07 AM IST
Highlights

తెలంగాణకు కేంద్ర నిధులపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు.. మహారాష్ట్రలో పోటీ చేయాలనే టీఆర్ఎస్ ఆలోచనపై కూడా ఆయన స్పందించారు.

హైదరాబాద్: తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులపై, మహారాష్ట్రలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పోటీ చేసే యోచనపై కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథవాలే తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకు సవాల్ విసిరారు. తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదంటున్న కేసీఆర్ ఓసారి ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలవాలని ఆయన అన్నారు. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇటీవల ప్రధానిని కలిసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు దేశాభివృద్ధికి అత్యంత కీలకమైనవని ఆయన హైదరాబాదులో మీడియాతో అన్నారు. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదని అన్నారు. 

కేసీఆర్ ఢిల్లీకి వెళ్లలేని పక్షంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వివరాలను తనకు పంపించాలని ఆయన అన్నారు. తాను కేంద్ర ఆర్థిక మంత్రితో మాట్లాడుతానని ఆయన అన్నారు. కేసీఆర్ తో చాలా కాలం నుంచి తనకు మంచి సంబంధాలున్నాయని ఆయన చెబుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో తమ పార్టీ ఆర్పీఐ మద్దతు తెలిపిందని చెప్పారు. 

మహారాష్ట్రలో పోటీ చేస్తామని టీఆర్ఎస్ చెబుతోందని, తాము దాన్ని ఆహ్వానిస్తున్నామని, ఆ స్థితిలో తమ పార్టీ కూడా తెలంగాణలో పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ పలు రంగాల్లో అభివృద్ది చెందిందని, అయితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఈ అంశంపై కేసీఆర్ దృష్టి సారించాలని ఆయన కోరారు. 

click me!