ఖమ్మం: బీజేపీ కార్యకర్త సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

Siva Kodati |  
Published : Apr 20, 2022, 05:08 PM ISTUpdated : Apr 20, 2022, 05:09 PM IST
ఖమ్మం: బీజేపీ కార్యకర్త సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

సారాంశం

ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ కుటుంబాన్ని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పరామర్శించారు. కొత్తగూడెం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అక్కడి నుంచి నేరుగా ఖమ్మం వచ్చారు. 

ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ కుటుంబాన్ని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (rajeev chandrasekhar) పరామర్శించారు. సాయిగణేష్ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ యువ కార్యకర్తలను కోల్పోయిందని రాజీవ్ అన్నారు. ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆయన దుయ్యబట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరపాలని రాజీవ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. 

అంతకుముందు Khammamలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యపై CBI విచారణ జరిపించాలని  బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.ఈ విషయమై చొరవ చూపాలని  తెలంగాణ గవర్నర్  తమిళిసై సౌందర రాజన్‌ను బీజేపీ నేతలు కోరారు.  బుధవారం ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ Tamilisai Soundararajan తో BJP నేతలు భేటీ అయ్యారు. ఈ మేరకు గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు. మరోవైపు సాయి గణేష్ ఆత్మహత్య విషయమై బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay మల్దకల్ లో ప్రజా సంగ్రామ యాత్ర శిభిరం వద్దే నిరసనకు దిగారు.  

ఈ నెల 14వ తేదీన ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు తాగిన సాయి గణేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న మరణించాడు.  ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో సాయి గణేష్ మీడియాతో మాట్లాడారు. తనపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 16 కేసులు నమోదు చేయించారన్నారు. అంతేకాదు తనపై రౌడీషీట్ కూడా ఓపెన్ చేయించారన్నారు. ఈ వేధింపులు భరించలేకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా గణేష్ చెప్పారు.  అయితే సాయి గణేష్ నుండి పోలీసులు మరణ వాంగ్మూలం తీసుకోలేదు.  సాయి గణేష్ మరణించడంతో ఆసుపత్రిపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. అలాగే మంత్రి కేటీఆర్ టూర్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ధ్వంసం చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు