amit shah telangana tour: తెలంగాణకు రావాలంటే కేసీఆర్ పర్మిషన్ తీసుకోవాలా : టీఆర్ఎస్ నేతలపై కిషన్ రెడ్డి ఫైర్

By Siva KodatiFirst Published May 14, 2022, 7:41 PM IST
Highlights

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు కిషన్ రెడ్డి. ఇక్కడికి రావాలంటే కేసీఆర్ అనుమతి తీసుకోవాలా అంటూ ఫైరయ్యారు. అందరికీ తెలంగాణపై హక్కు వుందని కిషన్ రెడ్డి అన్నారు. 
 

టీఆర్ఎస్ పార్టీ నేతలు (trs) అమిత్ షా (amit shah) రాకపై అనేక ప్రశ్నలు సంధించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) మండిపడ్డారు. తుక్కుగూడలో జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర (praja sangrama yatra) ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఎవరైనా , ఎక్కడికైనా వెళ్లే అవకాశం వుందని కిషన్ రెడ్డి చురకలు వేశారు. తెలంగాణ అసెంబ్లీపై విజయ పతాకానికి ఎగురవేయడానికి అమిత్ షా వస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబానికి (kcr family) రాసిచ్చామా.. ఇదేమైనా నిజం పరిపాలనా అని ఆయన ప్రశ్నించారు. ఎంతోమంది త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని.. హైదరాబాద్‌కు ఎవరైనా రావాలంటే కల్వకుంట్ల కుటుంబం పర్మిషన్ తీసుకోవాలా అని కిషన్ రెడ్డి నిలదీశారు. 

బీజేపీ , జేఏసీ, కవులు కళాకారులు లేకుండా తెలంగాణ వచ్చేదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు ఈ రాష్ట్రంపై హక్కు వుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణపై కల్వకుంట్ల కుటుంబానికి ఎంత హక్కుందో , ఉద్యమకారులకు , బీజేపీకి కూడా అంతే హక్కుందని ఆయన గుర్తుచేశారు. టీఆర్ఎస్ వైఫల్యాల్ని, బీజేపీ చైతన్యాన్ని సభ ద్వారా తెలియజెప్పాలని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గడిచిన 8 ఏళ్లలో ప్రతీ గ్రామ పంచాయతీకి కేంద్రం నిధులు ఇచ్చిందని కిషన్ రెడ్డి  గుర్తుచేశారు. 

ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ (covid vaccine) ఇచ్చిన ఘనత మోడీదేనని (narendra modi) కేంద్ర మంత్రి ప్రశ్నించారు. దళితుణ్ని సీఎం చేస్తామని చెప్పే దమ్ము కేసీఆర్‌కు వుందా అని కిషన్ రెడ్డి నిలదీశారు. టీఆర్ఎస్, కేసీఆర్‌ను దళితులు నమ్మే పరిస్థితి లేదని.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరవలేదని ఆయన ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అన్నారని.. ఏమైందన్నారు. దళితుణ్ని సీఎం చేయకుండా తానే ముఖ్యమంత్రి అయ్యారని కేసీఆర్‌కు చురకలు వేశారు. దళితులను కేసీఆర్ మోసం చేశారని.. వారికి మూడెకరాల భూమి ఇవ్వలేదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ఉపాధి హామీ పథకానికి రూ.30 వేల కోట్లు ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. 

click me!