తెలంగాణకు మిగతా రాష్ట్రాలు వేరు.. ఆంధ్రా వేరు: అంబులెన్స్‌ల నిలిపివేతపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 14, 2021, 10:48 PM IST
Highlights

కరోనా చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చే అంబులెన్సులు ఆపడం సరికాదన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి. ఇతర రాష్ట్రాలతో వ్యవహరించిన విధంగా ఆంధ్ర రాష్ట్రంతో వ్యవహరించకూడదని ఆయన హితవు పలికారు.

కరోనా చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చే అంబులెన్సులు ఆపడం సరికాదన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి. ఇతర రాష్ట్రాలతో వ్యవహరించిన విధంగా ఆంధ్ర రాష్ట్రంతో వ్యవహరించకూడదని ఆయన హితవు పలికారు.

తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారం ఉండాలని సూచించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకొని సమస్య పరిష్కరించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. అలాగే హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం గౌరవించాలని, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను ఆపడం సరికాదని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌ వచ్చేందుకు అంబులెన్స్‌లకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలన్నారు. ఈవిషయమై  తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కేంద్ర హోంశాఖ కార్యదర్శి,మాట్లాడారని అన్నారు.  

Also Read:హైకోర్టు ఆదేశాలు: సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్‌లకు అనుమతి.. పాస్‌ లేకున్నా గ్రీన్‌సిగ్నల్

ఏపీ- తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో టీ. సర్కార్ రంగంలోకి దిగింది. ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌ల విషయంలో ఆంక్షలను సడలించింది. దీనిలో భాగంగా సూర్యాపేట జిల్లాలోని రామాపురం చెక్‌పోస్ట్‌ వద్ద అమలు చేసిన ఆంక్షలను పోలీసులు సడలించారు.

దీంతో ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లను పోలీసులు అనుమతిస్తున్నారు. దీంతో రోగుల బంధువులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎలాంటి పాసులు లేకున్నా కొవిడ్‌ బాధితుల అంబులెన్సులను పోలీసులు అనుమతిస్తున్నారు. అలాగే, జోగులాంబ జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద కూడా ఏపీ అంబులెన్సులను తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. 

click me!