తెలంగాణలో కోవిడ్ జోరు: కొత్తగా 4,305 కేసులు.. 29 మంది మృతి

By Siva KodatiFirst Published May 14, 2021, 9:55 PM IST
Highlights

తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 57,416 కరోనా టెస్టులు నిర్వహించగా 4305 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 57,416 కరోనా టెస్టులు నిర్వహించగా 4305 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ 6361 మంది కోలుకోగా, 29 మంది మరణించారు. దీంతో ఇప్పటిదాకా రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 2896కి చేరింది.

అలాగే ఇప్పటివరకు 5,20,709 మంది కరోనా బారిన పడగా.. 4,62,981 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉంటే అత్యధికంగా గ్రేటర్ పరిధిలో 607 కేసులు నమోదవ్వగా.. ఆ తర్వాత ఆదిలాబాద్ 34. భద్రాద్రి కొత్తగూడెం 130. జీహెచ్ఎంసీ 607. జగిత్యాల 125. జనగామ 63. జయశంకర్ భూపాలపల్లి 76. జోగులాంబ గద్వాల 71. కామారెడ్డి 36. కరీంనగర్ 229. ఖమ్మం 222. కొమరం భీం ఆసిఫాబాద్ 29. మహబూబ్ నగర్ 137. మహబూబాబాద్ 94. మంచిర్యాల 139. మెదక్ 47, 

మేడ్చల్ మల్కాజ్ గిరి 291. ములుగు 51. నాగర్ కర్నూలు 143. నల్గొండ 246. నారాయణపేట్ 26. నిర్మల్ 25. నిజామాబాద్ 82. పెద్దపల్లి 134. రాజన్న సిరిసిల్ల 71. రంగారెడ్డి 293. సంగారెడ్డి 111. సిద్ధిపేట 169. సూర్యాపేట 31. వికారాబాద్ 158. వనపర్తి 110. వరంగల్ రూరల్ 122. వరంగల్ అర్బన్ 128. యాదాద్రి భువనగిరి 75 కేసులు వెలుగుచూశాయి. ఇక ఈరోజు కోవిడ్ నిర్థారణా పరీక్షలతో కలిపి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు టెస్టుల సంఖ్య 1,39,52,378కి చేరుకుంది.
 

click me!