ప్రాణాలు పోతుంటే.. మీకు రాజకీయాలు కావాలా: కేసీఆర్‌ ఫ్యామిలీపై కిషన్ రెడ్డి విమర్శలు

By Siva KodatiFirst Published Apr 24, 2021, 2:53 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా మరణాలను దాస్తోందని ఆయన ఆరోపించారు. 

తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా మరణాలను దాస్తోందని ఆయన ఆరోపించారు. శనివారం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం 24 గంటలు.. మూడు షిఫ్టుల్లో ఉత్పత్తి ప్రారంభించిందని తెలిపారు.

గాలి ద్వారా కూడా ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు. మనుషుల ప్రాణాలు పోతుంటే రాజకీయాలు అవసరం లేదని... కేసీఆర్‌ కుటుంబం కేంద్రంపై అనవసర ఆరోపణలు చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

Also Read:తెలంగాణలో కరోనా విశ్వరూపం: తాజాగా 7432 కేసులు, 32 మరణాలు

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపట్లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో నమోదవుతున్న కేసులు, మరణాలను బట్టి కేంద్రం.. టీకా, ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోందని ఆయన వెల్లడించారు.

వచ్చే రెండు, మూడు రోజుల్లో రాష్ట్రానికి మరింత ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ సరఫరా అవుతుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ఉత్పత్తికి 2 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు.

click me!