మాకు కాంగ్రెస్ ఎంత దూరమో.. బీఆర్ఎస్ కూడా అంతే దూరం: రాహుల్ ప్రసంగంపై కిషన్ రెడ్డి ఫైర్

Published : Jul 03, 2023, 03:46 PM IST
మాకు కాంగ్రెస్ ఎంత దూరమో.. బీఆర్ఎస్ కూడా అంతే దూరం: రాహుల్ ప్రసంగంపై కిషన్ రెడ్డి ఫైర్

సారాంశం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారని.. మరి ఆయన ఏ రకంగా రాజకీయాల్లోకి వచ్చారని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లది లోపాయికారి ఒప్పందం అని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలిసి బీజేపీపై కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలిసి పనిచేశాయని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి కేసీఆర్‌ మద్దతిచ్చారని చెప్పారు. ఇవన్నీ గమనిస్తే బీఆర్ఎస్‌తో ఎవరూ కలిశారనేది అర్థం అవుతుందని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఘోరంగా విఫలమయ్యారని.. పార్టీ నడపలేనని అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పక్కకు తప్పుకున్నారని విమర్శించారు. అటువంటి వ్యక్తికి బీజేపీని విమర్శించే నైతిక హక్కు ఉందా? అని ప్రశ్నించారు. గత వారం కాంగ్రెస్‌తో కలిసి బీజేపీయేతర పార్టీల సమావేశంలో ఉన్న అఖిలేష్ యాదవ్.. ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిశారని అన్నారు. తద్వారా ఎవరు ఎవరికి బీ టీమో అర్థం చేసుకోవచ్చని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. 

కేసీఆర్ ఒక సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని.. ఆ పార్టీలోనే నాయకుడిగా ఎదిగాడని అన్నారు.  గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నాయని.. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారాన్ని కూడా పంచుకున్నాయని అన్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు కట్టకట్టుకుని.. బీఆర్ఎస్‌లో విలీనం అయ్యారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్‌ఏ ఒకటేనని.. రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలని విమర్శించారు. ఇలాంటి పార్టీల తమను విమర్శిస్తాయా? అని ప్రశ్నించారు. 

తమకు కాంగ్రెస్ ఎంత దూరమో.. బీఆర్ఎస్ కూడా అంతే దూరమని అన్నారు. తాము గతంలో బీఆర్ఎస్‌తో కలవలేదని.. భవిష్యత్తులో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగానే చెప్పారని అన్నారు.  బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎవరూ అధికారంలో ఉన్న మజ్లీస్ పార్టీని పెంచి పోషించారని విమర్శించారు. రాహుల్ గాంధీ కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారని.. మరి ఆయన ఏ రకంగా రాజకీయాల్లోకి వచ్చారని ప్రశ్నించారు. 

 కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దేశానికే ఎక్కువ నష్టమని కిషన్ రెడ్డి అన్నారు.అధికారం కోసం కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?