కాళేశ్వరంపై కేసీఆర్ కుటుంబం గప్పాలు పలికింది .. ఇప్పుడు ఒక్కరూ మాట్లాడరే : మేడిగడ్డ ఘటనపై కిషన్ రెడ్డి వ్యాఖ్య

By Siva Kodati  |  First Published Oct 26, 2023, 8:09 PM IST

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు . కాళేశ్వరం మీద గప్పాలు పలికిన చంద్రశేఖర్ రావు, ఆయన కుటుంబం ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 
 


మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ది పిచ్చి తుగ్లక్ డిజైన్ అని.. అలాంటిది మేడిగడ్డ వద్ద పిల్లర్ కుంగిపోతే ఎవరో కుట్ర చేశారని కేసు పెడతారా అని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించినట్లుగా బీఆర్ఎస్ చెబుతోందని.. కానీ అది ఒక చారిత్రాత్మక తప్పిదంగా ఆయన అభివర్ణించారు. చేసిన తప్పు తెలుసుకుని కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

రూ.30 వేల కోట్ల ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.1.30 లక్షల కోట్లకు పెంచారని.. అప్పులు చేసి పనికిరాని చెత్త ప్రాజెక్ట్‌ను నిర్మించారని ఆయన దుయ్యబట్టారు. ప్రాజెక్ట్ నాణ్యతపై న్యాయ విచారణకు సిద్ధమా అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. డ్యాం సేఫ్టీ కమిటీ ప్రాజెక్ట్‌ను పరిశీలిస్తోందని.. వారు అడిగిన ప్రశ్నలకు మన అధికారులు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారని ఆయన చురకలంటించారు. కాళేశ్వరం మీద గప్పాలు పలికిన చంద్రశేఖర్ రావు, ఆయన కుటుంబం ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

Latest Videos

undefined

ALso Read: కాంగ్రెస్‌లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని.. ప్రజలను మోసం చేసినందుకు కేసీఆర్‌పై కేసు పెట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మేడిగడ్డ నాణ్యతపై లోపాలు వెలుగుచూడటం చూస్తే ప్రాజెక్ట్ నిర్మాణంపై అనుమానాలకు తావిస్తోందని ఆయన పేర్కొన్నారు. భైంసాలో అరాచకం కనిపిస్తోందని.. మనం బైంసాలో వున్నామా , పాకిస్తాన్‌లో వున్నామా అని కిషన్ రెడ్డి నిలదీశారు. చివరికి ఈ ప్రాంతంలో  పండుగలు కూడా భయంభయంగా చేసుకోవాల్సిన పరిస్ధితి వుందన్నారు. మోడీ ప్రధాని అయ్యాక దేశంలో ఎరువుల కొరత లేదని, కరెంట్ కోతలు లేవని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

click me!