కేసీఆర్‌తో మంత్రుల బృందం భేటీ: పీయూష్ తో సమావేశం వివరాలు కేసీఆర్ కు వెల్లడి

Published : Mar 25, 2022, 03:44 PM ISTUpdated : Mar 25, 2022, 03:57 PM IST
కేసీఆర్‌తో మంత్రుల బృందం భేటీ: పీయూష్ తో సమావేశం వివరాలు కేసీఆర్ కు వెల్లడి

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ తో మంత్రుల బృందం శుక్రవారం నాడు భేటీ అయింది. ఢిల్లీలో పరిణామాలను సీఎం కేసీఆర్ కు నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం వివరించనుంది.


హైదరాబాద్: తెలంగాణ సీఎం KCRతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి Niranjan Reddy నేతృత్వంలోని మంత్రుల బృందం శుక్రవారం నాడు Pragati Bhavanలో భేటీ అయింది.Punjab రాష్ట్రం నుండి Paddy  ధాన్యం కొనుగోలు చేసినట్టే Telangana నుండి వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కేంద్ర ఆహార శాఖ మంత్రిని తెలంగాణ మంత్రులు గురువారం నాడు కలిశారు. బుధవారం నాడు కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను తెలంగాణ మంత్రులు కలిశారు. అయితే  గురువారం నాడు కలుద్దామని తెలంగాణ మంత్రులకు కేంద్ర మంత్రి Piyush Goyal సూచించారు.

గురువారం నాడు తన చాంబర్ లో తెలంగాణ మంత్రులు నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ ,పువ్వాడ అజయ్ కుమార్ లు ఈ నెల 22వ తేదీన ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి వైఖరిని  తెలంగాణ మంత్రులు న్యూఢిల్లీలో మండిపడ్డారు.

కేంద్ర మంత్రితో జరిగిన చర్చకు సంభాషణకు సంబంధించిన సారాంశాన్ని మంత్రుల బృందం కేసీఆర్ కు వివరించనున్నారు. తెలంగాణలో ఉత్పత్తి అయిన వరి ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలని  కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం.

అయితే రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే కేంద్రంపై తెలంగాణ తరహా పోరాటం చేస్తామని కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు.కేంద్రం వ్యవహరశైలిపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉంది. వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ టీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు చేయనుంది. స్థానిక సంస్థలు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపనున్నారు. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిపై నల్ల జెండాలు ఎగురు వేయాలని కూడా టీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. 

గతంలో కూడా ఇందిరా పార్క్ వేదికగా వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్  స్వయంగా ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాన రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే అవసరమైతే ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద వరి ధాన్యం పోసి తమ నిరసనను కూడా దిగుతామని కేసీఆర్ గతంలోనే హెచ్చరించిన విషయం తెలిసిందే.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్పీచ్ | CM Revanth Reddy Speech on Telangana Education
Hyderabad Rains : గోల్కొండ బోనాన్ని తడిపిన వానచినుకులు.. ఈ సాయంత్రం నగరంలో జోరువానలే, ఈ ప్రాంతాల్లో అలర్ట్