అధికారం చేజారిపోతుందనే టీఆర్ఎస్ భయం: బండి సంజయ్,రాజాసింగ్ అరెస్టులపై కిషన్ రెడ్డి

By narsimha lodeFirst Published Aug 23, 2022, 1:44 PM IST
Highlights

అధికారం చేజారిపోతుందనే భయంతోనే బండి సంజయ్ ను, రాజాసింగ్ లను రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. 

హైదరాబాద్: అధికారం చేజారిపోతోందనే  భయంతోనే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.మంగళవారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పాదయాత్రను నిలిపివేసి  బండి సంజయ్ ను అరెస్ట్ చేయడాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. కేసీఆర్ ప్రభుత్వం విపరీత ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన నుండి  ప్రజలు త్వరలోనే  విముక్తి పొందుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

కేటీఆర్ సీఎం కాలేడనే నిరాశా, నిస్పృహలు కేసీఆర్ లో నెలకొన్నాయన్నారు. ఈ కారణంగానే  బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు  బనాయిస్తున్నారని ఆయన చెప్పారు.    బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకొనేందుకు గాను సీఎంఓ ప్రయత్నిస్తుందని  ఆయన ఆరోపించారు.  అంతేకాదు రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులపై సీఎంఓ ఆదేశాల మేరకే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని  చెప్పారు.  కేసీఆర్ కుటుంబానికి వినాశకాలం దాపురించిందన్నారు. అందుకే బీజేపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తుందన్నారు. కేసులకు తమ పార్టీ కార్యకర్తలు భయపడరని ఆయన చెప్పారు. 
 

click me!