బండి సంజయ్ కి అమిత్ షా ఫోన్: అరెస్టులపై ఆరా తీసిన కేంద్ర మంత్రి

By narsimha lodeFirst Published Aug 23, 2022, 1:22 PM IST
Highlights

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం నాడు ఫోన్ చేశారు.  సంజయ్ అరెస్ట్ కు దారి తీసిన పరిస్థితులతో పాటు  రాజాసింగ్ అరెస్ట్ విషయమై కూడ అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. 

న్యూఢిల్లీ: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కేంద్ర మంత్రి అమిత్ షా మంగళవారం నాడు ఫోన్ చేశారు. జనగామ జిల్లాలో  ప్రజా సంగ్రామ యాత్రలో బస చేసిన చోటునే బండి సంజయ్ దీక్షకు ప్రయత్నించడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.  ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసకోవాలని బీజేపీ నేతలు సోమవారం నాడు ఆందోళనకు దిగారు.ఈ ఆందోళన చేసిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు  హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.ఈ కేసులను నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. బీజేపీ శ్రేణులపై అక్రమ కేసులను నిరసిస్తూ  దీక్షకు దిగేందుకు బండి సంజయ్ ప్రయత్నించడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 

బండి సంజయ్ తో పాటు  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ విషయమై  కూడ అమిత్ షా బండి సంజయ్ తో చర్చించారని సమాచారం.  రాష్ట్రంలో  చోటు చేసుకున్న పరిణామాలను బండి సంజయ్ అమిత్ షా కు వివరించారు. మరో వైపు పాదయాత్రను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని బండి సంజయ్ కు అమిత్ షా సూచించారు. ధైర్యం కోల్పోవద్దని కూడా బండి సంజయ్ కు అమిత్ షా చెప్పారు. ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలపై పోరాటం చేయాలని కూడా అమిత్ షా బండి సంజయ్ తో చెప్పారు. 

also read:లిక్కర్ స్కామ్‌పై ఆరోపణలు: బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేసిన కల్వకుంట్ల కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై  కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందనిబీజేపీ నేతలు ఆరోపించారు. ఈ స్కాం తో తనకు సంబంధం లేదని కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తనపై ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారంచేసిన బీజేపీ నేతలపై కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేశారు.   ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమ దర్యాప్తు సంస్థలకు తాను సహకరిస్తానని కూడా కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు సంబంధం లేని విషయంలో తనపై దుష్ప్రచారం చేయడంపై కవిత మండిపడ్డారు.

click me!