తెలంగాణ విమోచన దినోత్సవం ప్రజలకు పండగ రోజు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By narsimha lodeFirst Published Sep 17, 2021, 10:00 AM IST
Highlights

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ విమోచన దినం తెలంగాణ ప్రజలకు పండుగ రోజు అని ఆయన పేర్కొన్నారు. మజ్లిస్ కనుసన్నల్లో రాష్ట్ర నడుస్తోందన్నారు.

హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు ఆయన హైద్రాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం విమోచనం పొందిన రోజు ప్రజలకు పండుగ రోజు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో  మజ్లిస్ చెప్పెదే అమలు అవుతోందన్నారు.టీఆర్ఎస్ గతంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎంఐఎంకి మద్దతిచ్చే పార్టీలకు మనుగడ ఉండదని ఆయన  చెప్పారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ నిర్మల్ లో బీజేపీ పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేసింది.ఈ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో  విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని  ప్రతి ఏటా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

 

click me!