నేడు నిర్మల్‌కి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా: బహిరంగసభలో పాల్గొననున్న మంత్రి

By narsimha lodeFirst Published Sep 17, 2021, 9:33 AM IST
Highlights


కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  శుక్రవారం నాడు నిర్మల్ కు రానున్నారు.సెప్టెంబర్ 17వ తేదీని పురస్కరించుకొని నిర్మల్ లోని వెయ్యి మంది అమరవీరులకు ఆయన నివాళులర్పిస్తారు. ఇక్కడ జరిగే బహిరంగసభలో అమిత్ షా పాల్గొంటారు.

నిర్మల్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శుక్రవారంనాడు  నిర్మల్‌ రానున్నారు. సెప్టెంబర్ 17వ తేదీని పురస్కరించకొని నిర్మల్ లోని వెయ్యి మంది అమరవీరులకు ఆయన నివాళులర్పిస్తారు. బీజేపీ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నిర్మల్‌ సభ కోసం బండి సంజయ్‌ తమ పాదయాత్రకు ఒకరోజు విరామం ఇవ్వనున్నారు. 

పాదయాత్రలో తనతో వెంట నడుస్తున్న 300 మంది కార్యకర్తలు, ఇతర నాయకులతో కలిసి నేరుగా నిర్మల్‌ బహిరంగసభ వేదికకు చేరుకుంటారు. నిర్మల్ ప్రాంతానికి చెందిన రాంజీగోండు సహా వెయ్యిమంది వీరుల ప్రాణత్యాగాల చరిత్రను దేశానికి తెలిసేలా చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు బీజేపీ నేతలు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో అమిత్‌షా ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.

ఇవాళ ఉదయం 9.25 నిముషాలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బీఎస్‌ఎఫ్‌ ప్రత్యేక విమానంలో బయలుదేరి నాందేడ్‌ విమానాశ్రయంలో ఆయన దిగుతారు .12 గంటలకు నాందేడ్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ముద్ఖేడ్‌ సీఆర్‌పీఎఫ్‌ శిక్షణా కేంద్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.ఆ తర్వాత ముద్ఖేడ్‌ నుంచి హెలికాప్టర్‌లో నిర్మల్‌కి చేరుకుంటారు. 

సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేస్తారు. ఆ తర్వాత బహిరంగసభలో ప్రసంగిస్తారు.æ సాయంత్రం 5 గంటల సమయంలో నిర్మల్‌ నుంచి హెలికాప్టర్‌లో నాందేడ్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

 

click me!