రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు

Published : Jul 22, 2022, 10:35 AM IST
 రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు

సారాంశం

రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ముర్మును అభినందించేందుకు పలువురు ఆమె ఇంటికి  క్యూ కట్టారు. 


న్యూఢిల్లీ: President Election ఎన్నికల్లో  విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రపతి పదవికి ఈ నెల 18వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రపతి పదవికి జరిగిన పోలింగ్ కు సంబంధించి ఈ నెల 21న ఓట్ల లెక్కింపు జరిగింది.  విపక్ష పార్టీల అభ్యర్ధి యశ్వంత్ సిన్హాను ఓడించి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. 

శుక్రవారం నాడు ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి Draupadi Murmu కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వీడ్కోలు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ విందును ఇస్తున్నారు. ఈ విందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు మొగులయ్య, రామచందర్ రావులను కూడా ఆహ్వానించినట్టుగా కేంద్ర మంత్రి Kishan Reddy  మీడియాకు చెప్పారు. మరో వైపు NDA భాగస్వామ్య పార్టీలతో పాటు విపక్ష పార్టీలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. మరో వైపు  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రేపు విందు ఇవ్వనున్నారు.ప్రధాని Narendra Modi  సహా కేంద్ర మంత్రులతో పాటు పలువురికి కోవింద్  విందు ఇవ్వనున్నారు.

ఇవాళ ఉదయం Tirupati నుండి వచ్చిన అర్చకులు ద్రౌపది ముర్మును ఆశీర్వదించారు. తిరుపతి వెంకటేశ్వరస్వామికి చెందిన ప్రసాదాన్ని అందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ద్రౌపది ముర్మును అభినందించేందుకు పలువురు ఆమె ఇంటికి క్యూ కట్టారు. ఈ నెల 25వ తేదీన ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?