హైద్రాబాద్‌లో దారుణం: చాకెట్లు ఆశ చూపి విద్యార్ధినులపై ప్రిన్సిపాల్ కొడుకు లైంగిక దాడి

Published : Jul 22, 2022, 09:25 AM ISTUpdated : Jul 22, 2022, 09:43 AM IST
హైద్రాబాద్‌లో దారుణం: చాకెట్లు ఆశ చూపి విద్యార్ధినులపై ప్రిన్సిపాల్ కొడుకు లైంగిక దాడి

సారాంశం

హైద్రాబాద్ నగరంలోని సంతోష్ నగర్ ప్రైవేట్ స్కూల్  ప్రిన్నిసాల్ కొడుకు విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయమై బాధితురాలు తన ఇంట్లో తెలిపింది.  దీంతో  బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


హైదరాబాద్:  Hyderabad నగరంలోని  Santosh Nagar  గల ఓ  ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ కొడుకు విద్యార్ఝినులపై Sexual Harassment కి  పాల్పడ్డాడు.  మైనర్ విద్యార్ధి,నులకు బిస్కట్లు, చాక్లెట్లు ఆశ చూపి  విద్యార్ధినులపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. అంతేకాదు విద్యార్ధినుల నగ్న వీడియోలు తీశాడు.ఈ విషయమై బాధిత విద్యార్ధిని ఒకరు ఈ విషయమై తన తండ్రికి తెలిపింది. దీంతో ఆయన  సంతోషనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 నిందితుడి తల్లి  ఈ స్కూల్ లో చాలా కాలంగా పనిచేస్తున్నారు. నిందితుడు కొంత కాలంగా  విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు., నిందితుడి వద్ద ఉన్న విద్యార్ధినుల నగ్న వీడియోలకు సంబంధించి కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. 

దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, దాడులకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకొన్నాయి. దేశంలో ప్రతి రోజూ ఈ తరహా ఘటనకు సంబంధించిన కేసులు నమోదౌతున్నాయి. లైంగిక వేధింపులను అరికట్టేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా కూడా ఈ తరహా ఘటనలు మాత్రం ఆగడం లేదు.  మహిళలపై దారుణాలకు పాల్పడిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలనే డిమాండ్ కూడా ఉంది. అయితే కొన్ని కేసుల విచారణ త్వరగా పూర్తి చేసి నిందితులకు శిక్షలు కూడా ఖరారు చేశారు. 

ఢిల్లీలో యువతిని తన కోరిక తీర్చాలని వేధింపులకు పాల్పడ్డాడు దుర్మార్గుడు. ఈ విషయమై ఆమె నిరాకరించింది. దీంతో  నిందితుడు ఆమె గొంతు కోసి హత మార్చాడు. ఈ ఘటన ఈ నెల 7వ తేదీన  ఢిల్లీలోని  గాంధీ నగర్ లో  చోటు చేసుకొంది. నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా వాసి మాన్ సింగ్‌గా గుర్తించినట్లు వారు తెలిపారు

మరోవైపు కర్ణాటక రాష్ట్రంలోని మధుగిరి తాలుకాలోని దొడ్డహట్టి గ్రామానికి చెందిన స్కూల్ టీచర్ విద్యార్ధుల తల్లులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనను ఈ నెల 1వ తేదీన సస్పెండ్ చేశారు. ఏదైనా పని మీద స్కూల్ వచ్చే విద్యార్థుల తల్లులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అంతేకాదు బాధితుల ఫోన్ నెంబర్లు తీసుకొని వారికి అసభ్యకరమైన మేసేజ్ లు, ఎస్ఎంఎస్ లు, వీడియోలు పంపేవాడు.ఈ విషయమై బాధితులు ఆందోళన చేయడంతో ప్రభుత్వ స్కూల్ టీచర్ సురేష్ పై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో యూత్ క్రికెట్ క్లబ్ లో మైనర్  బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కోచ్ ను విధుల నుండి తప్పించారు. ఈ ఘటన ఈ ఏడాది జూన్ 24న చోటు చేసుకొంది. బాధితురాలి పేరేంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు క్రికెట్ అసోసియేషన్లకు కూడా బాధిత కుటుంబం ఫిర్యాదును అందించింది. ప్రొద్దుటూరు, కడప క్రికెట్ అసోసియేషన్లు ఈ విషయమై విచారణ నిర్వహించి కోచ్ ను సస్పెండ్ చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

BRS Boycotts Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ఎదుట బిఆర్ఎస్ నాయకుల నిరసన| Asianet News Telugu
Kavitha Pressmeet: నా రక్తం ఉడుకుతోంది KCRపై CMరేవంత్ వ్యాఖ్యలను ఖండించిన కవిత | Asianet News Telugu