అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ ప్రచారం.. తేల్చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Siva Kodati |  
Published : Sep 13, 2022, 05:28 PM IST
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ ప్రచారం..  తేల్చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

సారాంశం

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తాను ఎంపీగా పోటీ చేయాలా లేక ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అన్నది పార్టీ నిర్ణయిస్తుందన్నారు  

తాను ఎంపీగా పోటీ చేయాలా లేక ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అన్నది పార్టీ నిర్ణయిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబర్‌పేట్ మీద ఆత్మీయత ఎప్పుడూ వుంటుందని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. టీఆర్ఎస్ అధికారంలోకి రాదని అమిత్ షా చెప్పారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కష్టపడితే అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. కుటుంబపాలనకు చరమగీతం పడాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. 

మునుగోడే కాదు.. తెలంగాణ అంతా అదే పరిస్థితి వుందన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రిగా తాను తెలంగాణకు ఏం తెచ్చానన్నది త్వరలోనే చెబుతానన్నారు. తనను కేంద్ర మంత్రిగా ఈ ప్రభుత్వం ఎప్పుడూ గుర్తించలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి రాసిన లేఖల్లో ఒక్కదానికి కూడా రిప్లయ్ ఇవ్వలేదని ఆయన ఫైరయ్యారు. సెప్టెంబర్ 17కు ఆర్టీసీ బస్సులు కావాలని అడిగినా ఇవ్వలేదని.. యాడ్‌ల కోసం మెట్రో పిల్లర్లు కూడా ఇవ్వకుండా బుక్ చేసుకున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALso REad:కేసీఆర్ ను మించిన ఫాసిస్టు లేరు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా ఈటల రాజేందర్ అసెంబ్లీకి ఎన్నికయ్యారని , ఈటల మాట్లాడే సమయంలో ఉండడం ఇష్టం లేకపోతే సభ బయట ఉండాలని కేసీఆర్ కు కిషన్ రెడ్డి సూచించారు. ఈటల రాజేందర్  ముఖం చూడడం ఇష్టం లేకపోతే  అసెంబ్లీకి రావొద్దని కేసీఆర్ ను కోరారు. ఈటల రాజేందర్ ను అసెంబ్లీలో మాట్లాడనివ్వని చెప్పిన కేసీఆర్ కంటే ఫాసిస్ట్ ఎవరని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి నీతులు వల్లిస్తారా అని కిషన్ రెడ్డి అడిగారు. ఈటల రాజేందర్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.రాజేందర్ ను అడుగడుగునా అవమానించే ప్రయత్నం చేస్తున్నారని, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?