ఒత్తిడి భరించలేకే ఐఐటీ విద్యార్ధి రాహుల్ సూసైడ్: సంగారెడ్డి ఎస్పీ

By narsimha lodeFirst Published Sep 13, 2022, 5:23 PM IST
Highlights

ఒత్తిడి భరించలేక సంగారెడ్డిలోని ఐఐటీ క్యాంపస్ లో  రాహుల్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ చెప్పారు. గత నెల 31 రాహుల్ సూసైడ్ చేసుకున్నారు. 
 

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఐఐటీ క్యాంపస్ లో రాహుల్ అనే విద్యార్ధి ఆత్మహత్యకు ఒత్తిడే కారణమని సంగారెడ్డి జిల్లా ఎస్పీ  రమణ కుమార్ చెప్పారు.ల్యాప్ టాప్ లో రాహుల్ సూసైడ్ లెటర్ కూడ లభ్యమైందని ఎస్పీ చెప్పారు.మంగళవారం నాడు ఎస్పీ రమణకుమార్ రాహుల్ ఆత్మహత్యకు గల కారణాలను మీడియాకు వివరించారు.

హైద్రాబాద్ ఐఐటీ క్యాంపస్ లో రాహుల్ ఎంటెక్ చదువుతున్నాడు. ఈ ఏడాది ఆగష్టు 31న రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ క్యాంపస్ లోని 107 నెంబర్ రూమ్ లో రాహుల్ మంచానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాహుల్ గదిలో నుండి దుర్వాసన రావడంతో విద్యార్ధులు  పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాహుల్ గది తలుపులు బద్దలు కొట్టారు.  రాహుల్ మృతికి సంబంధించి పోలీసుల దర్యాప్తు చేశారు. రాహుల్ ల్యాప్ టాప్ ను హైద్రాబాద్ పంపి ఓపెన్ చేయించారు. ల్యాప్ టాప్ లో రాహుల్ రాసిన సూసైడ్  లేఖ రాశాడని ఎస్పీ వివరించారు.  ఒత్తిడి భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా ఆ లేఖలో రాహుల్ వివరించాడని ఎస్పీ తెలిపారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం తెలిపింది. 

also read:హైద్రాబాద్ ఐఐటీ క్యాంపస్ లో ఎంటెక్ స్టూడెంట్ సూసైడ్

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా రాహుల్ ది. రాహుల్ మృతిపై ఆయన తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని ఆయన చెప్పారు.  ఇదే ఐఐటీలో చదువుతున్న మేఘా కుమార్ కూడా ఫెయిల్ అయ్యాయని  ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్పీ వివరించారు. లాడ్జీ భవనం నుండి దూకి మేఘా కుమార్ చనిపోయాడని ఎస్పీ వివరించారని ఆ కథనం వివరించింది. 

click me!