
Minister Kishan Reddy: ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రయత్నం చాలా దురదృష్టకరమని సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజ్యాంగాన్ని మార్చాలని సరికాదని అన్నారు. మంత్రి కిషన్ రెడ్డి బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రితో మాట్లాడటం నేర్చుకోమనీ, సీఎం కేసీఆర్ మాటలు రాజకీయ విలువలకు నైతిక విలువలకు మానవీయ విలువలు విరుద్దంగా ఉన్నాయని అన్నారు. ఆయన మాటాలు జుగుప్స కలిగించే విధంగా ఉన్నాయని,
రాజ్యాంగాన్ని మార్చాలని పేర్కొన్నడని మంత్రి కిషన్ రెడ్డి తప్పు పట్టారు. రాజ్యాంగం ఆధారంగానే తెలంగాణలో ప్రజలు ఉద్యమాలు నిర్వహించి పోరాటాలు చేశారనీ, ఆ రాజ్యాంగం ఆధారంగానే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి.. తెలంగాణ ఏర్పాటుకు చట్టం చేశారనీ, ఆ రాజ్యాంగం ఆధారంగా కెసిఆర్ గారి పార్టీ పెట్టుకున్నారని గుర్తుచేశారు. ఆ రాజ్యాంగం ఆధారంగా కేసీఆర్ గారు ఎన్నికల్లో పోటీ చేసి రెండు సార్లు గెలిచారనీ, అలాంటి రాజ్యాంగాన్ని మార్చాలని పేర్కోనడం చాలా దురదృష్టకరమని,
రాజ్యాంగ రూపకల్పనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడమేననీ, సీఎం కెసిఆర్ ప్రకటన పట్ల సమాజంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు, మేధావులు, కవులు, కళాకారులు విద్యార్థులందరూ సిద్ధాంతాలకు, రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉందని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ ఉపయోగించి మాట తీరు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్పు రావాల్సిన అవసరం ఉందనీ, అప్పుడు ఉద్యమాలు చేసేవాళ్ళం రాజకీయ పార్టీలో మాత్రం ఉండే వాళ్ళం కానీ ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులను మాట్లాడే విధానంలో అభిప్రాయాలు వ్యక్తం చేసే విధానంలో కొంత సమయం ఉండాల్సిన అవసరం ఉందనీ సూచించారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ప్రధానమంత్రి గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ తరువాత దాదాపు మూడు గంటల పాటు.. మీడియా ముందు ఏకపాత్రాభినయం చేశారని ఏద్దేవా చేశారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడినంత మత్రాన అబద్ధాలు నిజము కావని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత బడ్జెట్ కు ఈ బడ్జెట్ కు చాలా తేడా ఉండని, సరైనటువంటి వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారనీ, అది మంచి పద్ధతి కాదని మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం మీద ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు... కోట్ల మంది రైతులకు సంబంధించిన విషయం మాట్లాడుతున్నప్పుడు.. ఆచితూచి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.